ఏపీతో తెలంగాణను కలిపేస్తారు: రాజీనామాకు సిద్ధమంటూ బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్, తీవ్ర విమర్శలు

హైదరాబాద్: కేంద్రం, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం లేకపోతే.. తెలంగాణ రాకపోతే.. ఈ టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడ్నుంచి వచ్చాయని ప్రశ్నించారు. సంస్కారంతో ఆగుతున్నాం కానీ.. తిట్టడం మొదలు పెడితే తమ కంటే గొప్పగా నాలుకను ఎవరూ వాడలేరంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్

మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్

వరంగల్ బహిరంగ సభలో కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. తెలంగాణకు అడుగడుగునా మోసం చేస్తోందని కేంద్రం, బీజేపీపై మండిపడ్డారు. తాను చెప్పేది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు. తన మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా విసిరేస్తానన్నారు. కేంద్రానికి తెలంగాణ 3 లక్షల 65 వేల 797 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ, కేంద్రం తిరిగి ఇచ్చింది కేవలం లక్షా 68 వేల 647 కోట్లు మాత్రమే అన్నారు కేటీఆర్. దీనిపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు.

తెలంగాణను ఏపీతో కలుపుతారంటూ బీజేపీ కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణను ఏపీతో కలుపుతారంటూ బీజేపీ కేటీఆర్ తీవ్ర విమర్శలు

అంతేగాక, తెలంగాణను మళ్లీ ఆంధ్రప్రదేశ్‌తో కలుపుతారని, బీజేపీ దీనికి కూడా వెనకాడదని ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయ‌కులు ప‌చ్చి మోస‌గాళ్లు.. వారిని న‌మ్మొద్దని ప్రజ‌ల‌కు సూచించారు. ఎట్టికైనా, మ‌ట్టికైనా మ‌నోడే ఉండాలి. మ‌న పార్టీనే ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ కోసం కేసీఆర్ క‌డుపులో ఉండే బాధ‌, కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల‌కు ఉండ‌దని కేటీఆర్ అన్నారు. 2001లో కేసీఆర్ పేరున్న నాయకుడు కాదు. పెద్ద ఎవరికి తెలియని వ్యక్తి. అప్పుడు కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ, ఈ రోజు మెరుగుతున్న కుక్కలకు బట్టెబాజ్ గాళ్లకు మొఖం ఉందా? అని కేటీఆర్ దుయ్యబట్టారు.

బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ఎవడు సంజయ్, ఎవడు రేవంత్. మోడీని బట్టేబాజ్ అనరాదా, అమిత్ షా‌ను తిట్టారాదా కానీ మేము అలా మాట్లాడం. మాకు సభ్యత ఉంది. బఫేర్ నాయకులు బీజేపీ నేతలు. బీజేపీ నాయకులు చిల్లర గాళ్ళు. గఫర్ పార్టీ బీజేపీ. కరీంనగర్‌లో ఏం చెయ్యని ఎంపీ పాలమూరులో ఏదో చేస్తాడట. చెప్పిన మాటలు అన్ని మరిచి ఒకడు కేవలం కేసీఆర్‌ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని బీజేపీ నేతలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి వెన్నెముక లేని నేత అని, ఆయన మంత్రిగా ఉండటం తెలంగాణకు దౌర్భాగ్యమని కేటీఆర్ విమర్శించారు. మోడీ ఎందుకు బోడి ఎందుకు. బోడి బీజేపీ ఎందుకు మాకు. గుజరాత్‌లో తయారు అయ్యే రైలు బోగీలో మా తెలంగాణవారి పైసలు ఉన్నాయి. ఎవరి పైసలు ఎవరు తింటున్నారు? చట్టాన్ని తుంగలో తొక్కిన ఈ బీజేపీ నాయకులు ఏమనాలి. 67 ఏళ్లలో ఎవ్వరు చేయని పనులు ఇప్పుడు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు అని కేటీఆర్ దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+