బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష: కేసీఆర్ పై కిషన్ రెడ్డి సీరియస్!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులను దగా చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తూ నేడు బిజెపి 24 గంటల నిరాహార దీక్షకు దిగింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బిజెపి చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి బీఆర్ఎస్ సర్కార్ పై, కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇందిరాపార్క్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైపల్యాలు, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడారు.

BJPs 24-hour hunger strike for unemployed: Kishan Reddy fires on KCR!!

1200 మంది యువత తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నారని, అటువంటి యువత భవిష్యత్ కేసీఆర్ పాలనలో అంధకారంగా మారిందని అన్నారు. అనేక విద్య సంస్థలు తెలంగాణ కోసం పోరాటం చేశాయని గుర్తు చేసారు. 9 సంవత్సరాలుగా బి.ఆర్.యస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో.. నిరుద్యోగులకు ఉపాథి కల్పించకుండా అన్యాయం చేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు.

పరీక్ష పత్రాల లీకేజీ లతో 30 లక్షలమంది రోడ్డు న పడ్డారని ఆరోపించారు.నిరుద్యోగ యువత కి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీకేజీ లపై పోరాడితే బండి సంజయ్ కేసులు పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేతకానితనం వల్లే పేపర్ లీకేజీలు జరిగాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వాటాలు ఇస్తే గాని ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడం లేదని ఆరోపించారు. మిగులు రాష్ట్రాన్నిఅప్పుల రాష్ట్రంగా కెసిఆర్ మార్చారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+