బ్లాక్ మార్కెట్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్: రెండు ముఠాలు అరెస్ట్, రూ. 7వేల డ్రగ్.. 50వేలకు విక్రయం
హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఆంఫిటెరిసిన్-బీ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న రెండు ముఠాల గుట్టును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ రట్టు చేశారు. మొత్తం 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 28 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 7 వేలు ఉండే ఒక్కో ఇంజెక్షన్‌ను రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఆర్‌నగర్, జూబ్లీహిల్స్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

మొదటి ముఠాలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ పలువురి నుంచి కమిషన్‌పై ఇంజెక్షన్లు అమ్మి పెడతానంటూ తీసుకుని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురితో కలిసి దందా నిర్వహిస్తున్నాడని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
రెండో ముఠాలో బాలస్వామి ప్రధాన నిందితుడని సీపీ చెప్పారు. గుంటూరుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ.. మహిళకు తీవ్రగాయాలు, బైకర్‌కు కూడా
రోడ్డు దాటుతూ వాహనాలను గమనించకుండా వెళ్లిన మహిళను ఓ బైక్ ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బైకర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా అడ్డురావడంతో ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని నియంత్రించుకోలేక ఆమెను ఢీకొట్టేశాడు. ఈ ప్రమాదంలో మహిళతోపాటు వాహనదారుడికి గాయాలయ్యాయి.
ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ 12న రాయదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రోడ్డు దాటేప్పుడు తగిన జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications