పేలుడు: ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
హైదరాబాద్: చలి తీవ్రతకు తట్టుకోలేని చిన్నారులు చలి మంట వేసుకున్నారు. చిన్నారులు మంటను కాపుకుంటుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన పాతబస్తీ పహడీషరిఫ్‌లోని వెంకటాపూర్‌లో చోటు చేసుకుంది. గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే చలి మంటకు ఉపయోగించిన చెత్తలో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

రౌడీషీటర్ దారుణ హత్య
వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం రాజుపేటకు చెందిన రౌడీషీటర్ కంతపూడి సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం కొత్తమల్లూరు సమీపంలో ప్రధాన రహదారిపై సత్యనారాయణ మృతదేహాన్ని గుర్తించారు. తలపై తీవ్ర గాయాలుండటంతో ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం చిట్కుల్ సమీపంలో దారుణం జరిగింది. పెట్రోల్ పోసి గుర్తు తెలియని యువకుడిని దుండగులు తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆధారాలు సేకరించారు. డాగ్ స్కాడ్‌తో పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విద్యుత్ వైర్ తెగిపడటంతో గొర్రెల కాపరి మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొంద్గురు మండలం ముష్టిపల్లి వద్ద విషాదం చోటు చేసుకుంది. 11 కేవీ విద్యుత్ వైర్ తెగి పడటంతో గొర్రెల కాపరి మృతి చెందాడు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications