మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

Subscribe to Oneindia Telugu

భూపాలపల్లి: మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జయశంకర్‌భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం జయానగర్‌కాలనీ కొత్తపల్లి మార్గంలో చోటుచేసుకుంది. క్షతగాత్రుడని చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు.

ఏటూరునాగారం డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో వెంకటాపూర్ మండల పరిసర ప్రాంతాల్లో బాంబులు అమర్చారు. అంతేగాక, అక్కడక్కడా మావోయిస్టులు వాల్ పోస్టర్లు, పాంప్లెంట్లు, ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు.

Bomb blast in jayashankar bhoopalpally

ఈ నేపథ్యంలో వాటిని పోలీసులు తొలగిస్తున్నారు. కాగా, ఆటో డ్రైవర్ కార్తీక్(27) కూడా ఫ్లెక్సీ బోర్డులను తొలగిస్తుండగా, అక్కడే అమర్చిన బాంబు పేలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని మాక్స్ కేర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాంబు పేలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. విస్తృత కూంబింగ్ ప్రారంభించారు. చాలా కాలం తర్వాత మావోయిస్టుల తమ కార్యకలాపాలను విస్తృతం చేయడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mr. Kartheek was shifted to Max Care Hospital Warangal. Police visited to the spot and combing operation is going on. It seems Maoists challenged the Police after a gap of many years.
Please Wait while comments are loading...