అమీర్‌పేట మైత్రీవనం వద్ద బాంబు కలకలం: బాంబు స్క్వాడ్ తనిఖీలు
హైదరాబాద్: ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో శనివారం సూట్ కేసు బాంబు ఉందంటూ వచ్చిన వదంతులతో ఒక్కసారిగా కలకలం రేగింది. సత్యం థియేటర్ సమీపంలో ఒక సూట్‌కేసు అనుమానాస్పద పరిస్థితులలో కనిపిచండంతో అక్కడ ఉన్నవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు బాంబుస్క్వాడ్ చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. పాస్‌పోర్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్న టిఫెన్ సెంటర్‌వద్ద పడివున్న సూట్‌కేస్‌ను బాంబు స్వ్కాడ్ తెరిచి చూడగా అందులో ల్యాప్‌టాప్, ఛార్జర్, కొన్ని దుస్తులు, కాగితాలు మాత్రమే ఉన్నాయి.
పాస్‌పోర్ట్ పనిమీద వచ్చిన ఎవరో హడావుడిగా టిఫెన్‌చేసి సూట్‌కేస్‌ను మరిచిపోయి ఉండవచ్చని పోలీసులు చెప్పారు. సూట్‌కేస్ బాంబు ఉందని ప్రచారం జరగడంతో పాస్‌పార్ట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని బాంబు స్క్వాడ్ తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబుస్వ్కాడ్ వచ్చి సూట్ కేసును తెరిచి చూసే వరకూ ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొని ఉంది.
హైదరాబాద్‌లో సూదిగాడి కలకలం
వనస్థలిపురంలోని హిల్‌కాలనీలో సైకో సూదిగాడు కలకలం సృష్టించాడు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న రమ అనే మహిళపై సూదితో గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలని వివరాలు అడిగిన పోలీసులు స్థానికంగా అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు.












Click it and Unblock the Notifications