వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ-సికింద్రాబాద్ రైళ్ళలో బాంబుల బెదిరింపు: పోలీసులు, రైల్వే అలెర్ట్; బాంబుస్క్వాడ్ తనిఖీలు

|
Google Oneindia TeluguNews

గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పాడు. విశాఖపట్టణం నుండి సికింద్రాబాద్ వచ్చే రైళ్ళలో బాంబులు పెట్టామంటూ 100 కి ఫోన్ చేసి చెప్పాడు. ఇక విషయం విన్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమై సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైళ్లు ఆపి తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. అంతే కాదు విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తున్న రైళ్ళలోనూ తనిఖీలు చేపట్టారు.

త్వరలో కేసీఆర్ అరెస్ట్; ప్రత్యామ్నాయం నేనే.. కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్త్వరలో కేసీఆర్ అరెస్ట్; ప్రత్యామ్నాయం నేనే.. కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

విశాఖపట్నం - సికింద్రాబాద్ రైళ్లలో బాంబు పెట్టామని వచ్చిన బెదిరింపు కాల్ నేపథ్యంలో కాజీపేటలో ఎల్టిటి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేసి పోలీసులు, రైల్వే రక్షణా దళం తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే సమయంలో చర్లపల్లి లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కాజీపేటలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేసి రైలులో తనిఖీలు నిర్వహించిన లోకల్ బాంబు స్క్వాడ్, మరియు రైల్వే పోలీసులు అన్ని బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Bomb threat to Visakhapatnam-Secunderabad trains: Police, Railway police Alert

పోలీసు జాగిలాలతో అన్ని బోగీలను తనిఖీ చేసి అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను పరిశీలించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ ఎటువంటి బాంబు దొరకకపోవడంతో పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇక కోణార్క్ ఎక్స్ ప్రెస్ లోనూ ఎలాంటి పేలుడు పదార్ధాలు గుర్తించలేదు బాంబ్ స్క్వాడ్. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులు తాజా కాల్ నేపధ్యంలో మిగతా రైళ్ళను కూడా పరిశీలిస్తున్నారు.

ఇక ఈ ఫోన్ కాల్ చేసింది ఎవరు అన్న దానిపై దృష్టి సారించారు పోలీసులు. ఈ ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చింది? ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో విశాఖపట్టణం నుండి హైదరాబాదుకు వెళ్లే ట్రైన్ లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం అందించాలని రైల్వే పోలీసులు ప్రయాణికులకు చెబుతున్నారు.

English summary
Bomb threat to Visakhapatnam-Secunderabad trains. Police, Railway police Alert on the threat call. bomb squad, dog squad checkings in trains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X