ఘనంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు - పోటెత్తిన భక్తులు..!!

భాగ్యగనరంలో లష్కర్‌ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. తొలి పూజల అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలి రానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, ఎమ్మెల్సీ కవితమహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు.

Bonalu, Festival begins in Hyderabad, Minister Talasani performs first pooja

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో నిర్వహించే బోనాల పండగ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం నగరంలో ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. నగరంలో దాదాపు 19 ప్రాంతాల నుంచి బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునే విధంగా సిటీ బస్సులను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైన్‌, ఎంజీ రోడ్డు రాంగోపాల్‌పేట్‌ పాత పోలీస్‌స్టేషన్‌ కొత్త ఆర్చీ గేట్‌ నుంచి మహంకాళి పోలీస్‌స్టేషన్‌ మీదుగా ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ అంజలి టాకీస్‌ వైపు నుంచి వీఐపీలకు-1, సాధారణ భక్తులకు-1 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌ నుంచి సాధారణ భక్తుల క్యూలైన్‌ ఉంటుంది. డోనర్‌ పాస్‌ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనక వైపు నుంచి మరో క్యూలైన్‌ ఉంటుంది.మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Bonalu, Festival begins in Hyderabad, Minister Talasani performs first pooja

పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు గాను మహంకాళి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌ రూంని.. పోలీసు కామాండ్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు.

సుమారు 5లక్షల మంది బోనాలు సమర్పించనున్నట్లు ప్రభుత్వం అంచనావేసింది. నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీసుల ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనం సమర్పించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+