ఏపీ కుట్ర, అమరావతి గురించి అడిగామా: ఎంపీ బూర, కాంగ్రెస్ నేతల అరెస్ట్

న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన విపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, అసలు తాము ఏపీ రాజధాని అమరావతికి సేకరించిన భూమి గురించి ఎప్పుడైనా ప్రశ్నించామా అని తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం నాడు ప్రశ్నించారు.

విపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకే మల్లన్న సాగర్ పైన ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. విపక్షాలు సైంధవుల్లా అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కట్టి తీరుతామని చెప్పారు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మల్లన్న సాగర్ పైన అవగాహన లేదన్నారు. ఐదు జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించే మల్లన్న సాగర్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టు పైన ఏపీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీ రాజధానికి 500 ఎకరాలు చాలన్నారు.

బూర నర్సయ్య

బూర నర్సయ్య

మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన ఏపీ సర్కార్ కుట్ర చేస్తోందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. తాము ఎప్పుడైనా అమరావతికి సేకరించిన భూమి విషయమై ప్రశ్నించామా అని అడిగారు.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన చలో మల్లన్న సాగర్ మంగళవారం నాడు ఉద్రిక్తతకు దారి తీసింది. పలువురు నేతల అరెస్టు, నిర్బంధాలు, నిరసనలతో కార్యక్రమం అర్దాంతరంగా ముగిసింది.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాలకు కాంగ్రెస్‌ నేతలను వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు గాంధీ భవన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అరెస్టులు జరిగాయి.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

మల్లన్న సాగర్‌ బాధిత గ్రామ ప్రజలపై జరిగిన లాఠీచార్జి నేపథ్యంలో కాంగ్రె్‌సపార్టీ మంగళవారం చలో మల్లన్నసాగర్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వేములఘాట్‌ గ్రామానికి వెళ్లి లాఠీ దెబ్బలు తిన్న బాధితులను పరామర్శించేందుకు కాంకాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

మంగళవారం మధ్యాహ్నం పదకొండున్నర గంటల ప్రాంతంలో వేములఘాట్‌కు వెళ్లేందుకు టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానా రెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు గాంధీభవన్‌నుంచి బయలు దేరారు.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

అదే సమయంలో పోలీసులు గాంధీ భవన్లోకి లోపలికి చొచ్చుకు వచ్చారు. లోపలికి ఎలా వస్తారంటూ పోలీసులతో కాంగ్రెస్‌ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు గేటు బయట మోహరించారు. అదే సమయంలో జానారెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు వాహనాల్లో గాంధీభవన్‌ బయటకు వచ్చి చలో మల్లన్నసాగర్‌కు శ్రీకారం చుట్టారు. వారు బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

మల్లు భట్టి పోలీసులను ప్రశ్నించారు. ఆయనను కూడా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న కార్యక్రమాన్ని ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. వివిధ ప్రాంతాల్లో, పలువురు నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం వరకు వారిని నిర్బంధించి మూడు గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

ఇంకోవైపు, ముంపు గ్రామాలకు బయల్దేరిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలను ఆ గ్రామాలకు చేరక ముందే పోలీసులు అరెస్టు చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఎర్రవల్లి శివారులో అరెస్టు చేశారు.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ తదితరులను గజ్వేల్‌ శివారులో అరెస్టు చేసి చేగుంట పోలీస్ స్టేషన్ తరలించారు.

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

కాంగ్రెస్ నేతల ఆందోళన, అరెస్ట్

మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. చలో మల్లన్నసాగర్‌కు మద్దతుగా వివిధ జిల్లాల్లో కాంగ్రెస్‌ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+