బొమ్మ హెలికాఫ్టర్ ఎగరటం లేదని షాప్ యజమానిపై పోలీసులకు బాలుడి కంప్లైంట్.. వీడియో వైరల్!
సహజంగా చాలామంది పెద్దలే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడతారు. తమ ఇళ్లల్లో ఏదైనా చోరీ జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి కాస్త తటపటాయిస్తారు. పోలీసులంటే సమాజంలో చాలామందికి గౌరవంతో పాటుగా, ఒకింత భయం కూడా ఉంటుంది. అందుకే పోలీసుల వద్దకు వెళ్లాలంటే జంకుతారు. అలాంటిది పోలీసులంటే భయం లేకుండా, ఎంతో ధైర్యంగా చిన్నపిల్లలు కొందరు ఇటీవల కాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
పోలీస్ స్టేషన్ లకు భయం లేకుండా వెళ్తున్న పిల్లలు
గతంలో తన పెన్సిల్ పోయిందని, స్కూల్లో తనతోపాటు చదువుకుంటున్న ఓ విద్యార్థి తన పెన్సిల్ దొంగతనం చేశాడని కేసు పెట్టాలని ఓ పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు గ్రామంలో హనుమంతు అనే బాలుడు తన పెన్సిల్ తన తోటి విద్యార్థి దొంగతనం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పంచాయితీ పెట్టాడు.

షాప్ యజమాని మోసం చేశాడని బాలుడి ఫిర్యాదు
ఆ తర్వాత మరో విద్యార్థి తన సైకిల్ దొంగతనం అయిందని, ఇంటి దగ్గర పెట్టిన సైకిల్ పోయిందని, తన సైకిల్ వెతికి పెట్టాలంటూ ఫిర్యాదు చేశాడు. ఇక తాజాగా బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒక బాలుడు తనకు న్యాయం చెయ్యాలని పోలీసులను కోరాడు. తనను షాపు యజమాని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు.
బొమ్మ హెలికాఫ్టర్ కొన్న బాలుడు.. ఆపై జరిగిందిదే
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటివద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన పదేళ్ళ వినయ్ రెడ్డి అనే బాలుడు, జాతరలో రూ.300 పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్‌ను ఇచ్చి వేరే హెలికాఫ్టర్ బొమ్మ తెచ్చుకున్నాడు. అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్లగా ఆ షాప్ యజమాని హెలికాఫ్టర్ మార్చి వేరేది ఇచ్చాడు.
షాప్ యజమానిపై పోలీస్ స్టేషన్ లో బాలుడి ఫిర్యాదు
ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్లగా, షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూడు సార్లు బొమ్మ మార్చి ఇచ్చినా, మళ్ళీ వచ్చావని మండిపడ్డారు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
చివరకు ఏం జరిగిందంటే
బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్‌ను పంపగా, అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు. దీంతో బాలుడి తాతను పిలిచి, బాలుడిని సముదాయించి పోలీసులు ఇంటికి పంపించారు. అయితే ఎలాంటి భయం, ఇంకెవరి సహకారం లేకుండా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాలుడిని పోలీసులు అభినందించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
ఛీ ఏం మనుషులు మీరు.. మలయాళం బ్యూటీకి బిగ్ షాక్..? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications