బాలుడ్ని చిదిమేసిన జెసిబి: తల్లి రోదన (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. గొడవలతో భర్తకు దూరంగా ఉంటూ అశలన్నీ కుమారుడిపైనే పెట్టుకుని కాయకష్టంతో అతన్ని చదివిస్తోంది.
అయితే, ఆమె ఆశలన్నీ ఒక్క ప్రమాదంతో అడుగంటి పోయాయి. తల్లితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో జెసిబి బాలుడిపై నుంచి వెళ్లిపోయింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
శుక్రవారం జరిగిన ఆ సంఘటన స్థానికులను కలచివేసింది. ప్రమాదంలో మరణించిన బాలుడిని శివగా గుర్తించారు.

నల్లగొండ జిల్లా నుంచి వచ్చి...
నల్లగొండ జిల్లా చెన్నపట్నం మండలం గన్నెరపల్లికి చెందిన భారపటి తిరుపతమ్మ కర్మన్‌ఘాట్ డివిజన్‌లోని ఓంకార్ నగర్‌లో కుమారుడు శివ (5) తో కలిసి ఉంటోంది.

నర్సరీ చదివిస్తూ....
తిరుపతమ్మ కూలీపనులు చేసుకుంటూ తన కుమారుడు శివను హస్తినాపురంలోని సెంట్రల్ గ్రామర్ స్కూల్లో నర్సరీ చదివిస్తోంది.

ఆటోలో వచ్చి ఇలా..
శుక్రవారం ఉదయం కుమారుడితో ఆటోలో వచ్చిన తిరుపతమ్మ పాఠశాల ఎదురుగా ఉన్న వైట్‌హౌస్ గోదాము వద్ద దిగింది.

చూస్తుండగానే..
ఓ చేత్తో కుమారుడు శివను పట్టుకుని తిరుపతమ్మ రోడ్డు దాటుతుండగా వనస్థలిపురం వైపు వెళ్తున్న జెసిబి ఆమెను తాకడంతో ఆమె వెనక్కి పడిపోయింది.

శివ మాత్రం..
తిరుపతమ్మ వెనక్కి పడిపోగా, కుమారుడు శివ జెసిబీ టైర్ల కింద పడిపోయాడు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

ఆలస్యంగా పోలీసులు..
సంఘటనా స్థలానికి పోలీసులు ఆలస్యంగా వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర గంట తర్వాత పోలీసులు వచ్చారు.

తాగిన మత్తులో..
డ్రైవర్ తాగిన మత్తులో జెసిబిని నడిపాడని, డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని తిరుపతమ్మ బంధువులు ఆరోపించారు.

తాగి లేడని నిర్ధారణ..
జెసిబి డ్రైవర్ మద్యం తాగి లేదని పోలీసులు నిర్ధారించారు.

రాస్తారోకో...
మృతుడి బంధువులు, స్థానికులు రాస్తారోకో నిర్వహించారు.

యాజమాన్యం హామీ
ఆదుకుంటామని పాఠశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో రాస్తారోకో నిర్వహించారు.

కొడుకుపైనే ఆశలు..
కుమారుడు శివపైనే ఆశలు పెట్టుకున్న తల్లి తిరుపతమ్మ ఆశలను జెసిబి వమ్ము చేసింది.

కానరాని లోకాలకు...
కళ్లెదుటే కుమారుడు కానిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తిరుపతమ్మ బాధ చెప్పనలవి కాకుడా ఉంది.












Click it and Unblock the Notifications