హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chiranjeevi: మెగాస్టార్ రక్తదానం - నేను సైతం అంటూ బ్రిటన్ అధికారి అక్కడే..!!

|
Google Oneindia TeluguNews

Chiranjeevi Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు చిరంజీవి అభిమానులు..రక్తదానం చేయాలని భావించిన వారు మాత్రమే ఈ బ్లడ్ బ్యాంకు ద్వారా రక్త దానం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారేత్ విన్ ఓవెన్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్త దానం చేసారు. మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేసారు. ఆయనతో పాటుగా బ్రిటీష్ అధికారి కలిసారు. ఈ అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గుర్తిండిపోయేలా

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గుర్తిండిపోయేలా

ఎంతో మందికి రక్తదానం చేసిన చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఇప్పుడు చిరంజీవి మరోసారి రక్తదానం చేసారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారేత్ విన్ ఓవెన్ సైతం రక్తదానం చేయటంతో పాటుగా బ్లడ్ బ్యాంకు నిర్వహణ పైన ప్రశంసలు కురిపించారు. గ్యారేత్ తమ బ్లడ్ బ్యాంకుకు రావటంతో పాటుగా రక్తదానం చేయటం పైన చిరంజీవి ఆయన్ను అభినందించారు. తనకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు వచ్చినప్పుడు గ్యారేత్ విష్ చేశారని చిరంజీవి గుర్తు చేశారు. 25 సార్లకంటే ఎక్కువ బ్లడ్ డొనేట్ చేసిన వారికి గతంలో ఏడు లక్షల విలువగల జీవిత బీమా కార్డులు అందించామని చెప్పిన చిరంజీవి... ఇప్పుడు మరో1500ల మందికి జీవిత బీమా కార్డులు అందిస్తున్నామని వివరించారు.

బ్లడ్ బ్యాంకు క్రెడిట్ మెగా ఫ్యాన్స్ దే

బ్లడ్ బ్యాంకు క్రెడిట్ మెగా ఫ్యాన్స్ దే


బ్లడ్ బ్యాంక్ సక్సెస్ క్రెడిట్ చిరంజీవి అభిమానులదేనని తేల్చి చెప్పారు. తాను బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. అత్యవసర సమయంలో బ్లడ్ దొరక్క చాలా మంది చనిపోతున్నారని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ దూరపు బంధువు కూడా బ్లడ్ దొరక్క చనిపోయారని, అందుకే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశానని..తన వంతు సహాయం అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. బ్లడ్ బ్యాంకు హైదరాబాద్ కే పరిమిం కాకుండా విస్తరించాలనే ఆలోచన ఉందని చిరంజీవి చెప్పారు. కానీ, ఆ విధంగా చేయలేకపోతున్నానని వివరించారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కాల్ తో తన అభిమానులు అక్కడ బ్లడ్ ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ లోనే కాదు ప్రతి ఊరిలో ప్రతి చోట తన అభిమానులున్నారని చెప్పారు. తన అభిమానులు ఉన్న చోట బ్లడ్ బాంక్ ఉన్నట్టేనని చిరంజీవి పేర్కొన్నారు.

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తో మెగా బంధం

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తో మెగా బంధం


ప్రజల గురించి ఆలోచించే వాళ్లు తక్కువగా ఉంటారని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారేత్ పేర్కొన్నారు. అందులో చిరంజీవి ఒకరని ప్రశంసించారు. చిరంజీవి చేస్తున్న సేవలకు తన అభినందలు తెలిపారు. హైద్రాబాద్‌కు కొత్తగా వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌ను కొద్ది రోజుల క్రితం చిరంజీవి డిన్నర్‌కు పిలిచారు. ఆ డిన్నర్‌లో అతడిని మన తెలుగు సంప్రదాయ వంటకాలను రుచి చూపించారు. తెలుగుకు ప్రతీకగా నిలిచే ఆవకాయ్‌ను కూడా పెట్టానంటూ చిరు వెల్లడించారు. ఇక, ఇప్పుడు అదే అధికారితో కలిసి తన బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు.

English summary
British Deputy High Commissioner Gareth Wynn Owen Donates Blood At Chiranjeevi Charitable Trust along with megastar Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X