Jubilee hills: బీఆర్ఎస్ ను ఓడించిన సొంత పార్టీ నేతలు, తెర వెనుక
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఖాయమైంది. బీఆర్ఎస్ మరో సిట్టింగ్ స్థానం కోల్పోతోంది. చివరి వరకు పోటా పోటీగా నిలిచిన బీఆర్ఎస్.. కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన ఒపీనియన్ పోల్స్ లోనూ గెలిచే పార్టీగా నిలిచింది. అయితే, పోలింగ్ రోజే సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ కు అక్కడే ఓటమి ఖాయమైంది. పోలింగ్ తరువాత బీఆర్ఎస్ అంతర్గత విశ్లేషణల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓటమికి కారకులెవరో గుర్తించారు. ఆ 12 గంటల్లో సీన్ ఛేంజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ భారీ విజయానికి చేరువైంది.
జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ కన్నుమూతతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ గెలుపు కోసం సీఎం రేవంత్ తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గోపీనాథ్ సతీమణిని బీఆర్ఎస్ అభ్యర్దిగా ఖరారు చేసింది. ప్రచారం కోసం ఇతర పార్టీల కంటే ముందే రంగంలోకి దిగింది. అధికార పార్టీకి సహజంగా ఉండే అవకాశాలను గుర్తించింది. దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సమాయత్తం అయింది.

ఢీ అంటే ఢీ అనే నేతలకే జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలను అప్పగించింది. సామాజిక వర్గాల వారీగానూ రంగంలోకి దించింది. కొన్ని సర్వే సంస్థలు సైతం బీఆర్ఎస్ కే విజయం దక్కుతుందని అంచనాలు వెల్లడించాయి. అయితే, అధికార పార్టీ చివరి 24 గంటల్లో లెక్కలు మార్చేసింది. బీఆర్ఎస్ నేతలు అక్కడే కాంగ్రెస్ అధికార దెబ్బకు ఫిక్స్ అయిపోయారు. ఇక, ఓటింగ్ సీన్ మారిపోయింది.
కేటీఆర్ ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తానే తీసుకున్నారు. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు డివిజన్ల వారీగా పార్టీ నేతలను మొహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. అయితే, ప్రచారం ముగిసిన తరువాత పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలు తీసుకున్న గులాబీ పార్టీ నేతలు చేతులెత్తేసారు. సరిగ్గా ఆ 24 గంటలకే లెక్కలు మార్చేసింది. కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయని ఇప్పుడు ఫలితాల తరువాత బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అప్పటికే నేరుగా సీఎం రేవంత్ .. మంత్రులు మొత్తం కేబినెట్ అక్కడే మొహరించిన చివరి 24 గంటల్లో బీఆర్ఎస్ వారి ఆపరేషన్ సమర్ధవంతంగా తిప్పి కొట్టలేక పోయింది. నలుగురు మాజీ మంత్రులను బీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ కోసం దించింది.

అయితే, అధికార పార్టీకి ధీటుగా వారు వ్యవహరించ లేకపోయారు. ఇక.. సహజంగా చివరి సమయంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రక్రియ లో బీఆర్ఎస్ నేతలకు కల్లెం వేయటంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అంతే, పోలింగ్ సమయంలోనే బీఆర్ఎస్ తమ ఓటమి ఖాయమని డిసైడ్ అయింది. కాగా.. కాంగ్రెస్ పోలింగ్ పూర్తయిన వెంటనే 20 వేలకు పైగా మెజార్టీ సాధిస్తామని ధీమా గా చెబుతూ వచ్చింది.. ఇప్పుడు ఏడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 19,810 ఓట్ల మెజార్టీతో దూసుకు వెళ్తోంది. ఇక.. బీఆర్ఎస్ రెండు సిట్టింగ్ స్థానాలు గ్రేటర్ పరిధిలో కోల్పోవటం భారీ దెబ్బగానే మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications