కేసీఆర్ సంచలన నిర్ణయం- లక్ష మందితో కాళేశ్వరం బాట- అసలు టార్గెట్...!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల వేళ మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ నేతలకు మార్గినిర్దేశం చేసారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత భారీగా ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో సభకు హాజరు కావటం పైన ఆసక్తి కర చర్చ జరిగింది. కాగా.. ఏపీ సీఎం 2024 ఎన్నికల ముందు వ్యవహరించిన విధంగానే కేసీఆర్ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని.. అలాంటి బూతుల వీరుడితో అసెంబ్లీలో చర్చకు రావాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. పాలన చేతగాకనే సీఎం రేవంత్‌రెడ్డి బూతుపురాణం సాగిస్తున్నారని విమర్శించారు. సమావేశాల్లో అధికార పార్టీ నేతలు తన గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే పట్టించుకోవద్దని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు సూచించారు. శాసనసభ, మండలిలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల ఎజెండానే బీఆర్‌ఎస్ ఎజెండాగా ఉండాలని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టాలని.. స్పీకర్ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలపై నిలదీయాలని నిర్దేశించారు. కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించారు.

సీఎం అయిన తరువాతనే అసెంబ్లీకి
త్వరలోనే లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వద్దకు వెళదామని.. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను, నీటి పారుదల రంగానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిద్దామని పార్టీ నేతలతో కేసీఆర్ పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని.. అందుకు అనుగుణంగా పార్టీ నేతలు సిద్ధం కావాల్సి ఉంటుందని సూచించారు. కాగా.. సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నందున ఆయన అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలంతా భావించినట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు. గతంలో జయలలిత, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వంటి నేతలు కూడా గౌరవం లభించని సందర్భాల్లో సభకు దూరంగా ఉన్నారని గుర్తుచేశారు. ఒకవేళ అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకపోతే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా వెనకాడబోమని తీవ్రంగా హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
