సర్పంచ్ లకు మంత్రి సీతక్క శుభవార్త.. అసెంబ్లీలో వారికోసం కొత్త బిల్లు!

తెలంగాణా రాష్ట్రంలోని పంచాయతీల సర్పంచ్ లకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఆగకుండా నిధులు నేరుగా సర్పంచులకే అందేలా త్వరలో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్‌లో సర్పంచుల కోసం నిర్వహించిన 'సమర్థవంతమైన నాయకత్వం ద్వారా గ్రామ ప్రగతి' శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రజల్లో నైతిక విలువలను పెంపొందించే దిశగా సర్పంచులు

గ్రామాల్లో సర్పంచులు నిత్యం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, విమర్శలను మానసిక స్థైర్యంతో తట్టుకొని ముందుకు సాగాలని మంత్రి సీతక్క సూచించారు. అభివృద్ధి పనులతోపాటు ప్రజల్లో నైతిక విలువలను పెంపొందించే దిశగా సర్పంచులు నాయకత్వం వహించాలని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన తొమ్మిది రకాల ఆదర్శ గ్రామ అంశాలను అనుసరించాలని కోరారు.

Minister Seethakka says good news new bill will soon be introduced so village funds reach Sarpanches directly

గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇదే

2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 70(4) ప్రకారం గ్రామ పంచాయతీ నిధులపై చెక్కులు సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ కలిసి సంతకం చేయాలని నిబంధన పెట్టారు. ఇంతకు ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి జాయింట్‌గా సంతకం చేసేవారు. ప్రజాప్రతినిధులకే ఎక్కువ బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పించారు.

ఈ చట్టం వల్ల సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు

ఈ జాయింట్ చెక్ పవర్ వ్యవస్థ అనేక గ్రామాల్లో సమస్యగా మారింది. సర్పంచ్, ఉప సర్పంచ్ వేర్వేరు రాజకీయ పార్టీలకు లేదా కులాలకు చెందినప్పుడు విభేదాలు తలెత్తుతున్నాయి. ఉప సర్పంచ్ చెక్‌పై సంతకం చేయకుండా ఆలస్యం చేయడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. కొన్నిచోట్ల ఎస్సీ, ఎస్టీ సర్పంచులు ఉన్నప్పుడు ఉప సర్పంచ్ సహకరించకపోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి. సర్పంచుల గౌరవ వేతనాల చెక్కులపై కూడా సంతకాలు ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి.

కొత్త పెన్షన్ లకు అప్లై చేసుకున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
కొత్త పెన్షన్ లకు అప్లై చేసుకున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

కొత్త బిల్లు తీసుకొస్తున్నట్లు సీతక్క స్పష్టం

ఫలితంగా సర్పంచులు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. పనులు జరగకపోవడంతో గ్రామాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం నిధులు నేరుగా సర్పంచులకే అందేలా, అభివృద్ధి ఆగకుండా చూసేందుకు కొత్త బిల్లు తీసుకొస్తున్నట్లు సీతక్క స్పష్టం చేశారు. సర్పంచులు గ్రామాల్లో నాయకత్వం వహించి ప్రజలకు సేవ చేసేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+