పింక్ కలర్‌లో మెరిసిన బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథం..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఇక, రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచార పనిలో నిమగ్నమైపోయాయి. ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రథం సిద్ధమైంది. ఈ రథం పింక్ కలర్‌లో మెరిసి పార్టీ శ్రేణులందరిని ఆకట్టుకుంటుంది. బిఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. భారతదేశం పటం.. పింక్ కలర్‌లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రథం తళ్లుక్కుమంటుంది.
నేటి నుంచి కెసిఆర్ ప్రచారం : హుస్నాబాద్ వేదికగా నేడు ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎన్నికల ప్రచార రథం సిద్దమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ ఎన్నికల ప్రచారం రథం కొద్ది రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు చేరుకుంది. ఆదివారం నుంచి కెసిఆర్ ప్రచారం మొదలుకానుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై ఈ ప్రచార రథం పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. నేడు హుస్నాబాదుకు బిఆర్ఎస్ ప్రచార రథం చేరుకుంటుందని సమాచారం.

ఈ ప్రచారంలో కేసీఆర్ తో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా సీనియర్ నేతల జాబితాను కూడా సిద్ధం చేసి ఎన్నికల భారాన్ని పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన సొంత సిరిసిల్లతో పాటు ఈసారి పోటీకి రెండో నియోజకవర్గంగా హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), కామారెడ్డి నియోజకవర్గాల బాధ్యతలను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ అగ్రనాయకుడు హరీష్ రావు సైతం కీలక బాధ్యతల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.
ఆదివారమే మేనిఫెస్టో ప్రకటించనున్న బిఆర్ఎస్ : అయితే, ఈ క్రమంలోనే ఆదివారం నాడు బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించనున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా వీటితో పాటు పార్టీ తన అభ్యర్థులకు బి-ఫారాలను అందించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, రైతు రుణమాఫీ వంటి గత హామీలను పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపకల్పనలో కేసీఆర్ గణనీయమైన కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.












Click it and Unblock the Notifications