NH 365బిపై కేంద్రానికి డిమాండ్.. ఉద్యమిస్తామని హెచ్చరిక!
తెలంగాణా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జాతీయ రహదారి 365బి విషయంలో తెలంగాణా రాష్ట్రం నుండి కేంద్రానికి డిమాండ్ వినిపిస్తుంది. జాతీయ రహదారి 365 బి ని రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ కోరారు.
బండి సంజయ్ ను టార్గెట్ చేసిన మాజీ ఎంపీ
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని తెలంగాణ భవన్ లో విలేఖరులతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. మంత్రి బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు మానుకుని జాతీయ రహదారుల విషయంలో ప్రజల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.

జాతీయ రహదారులను విస్తరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల వేములవాడ పట్టణాల మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి '365బీ'ని కోరుట్ల వరకు విస్తరించాలని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా జాతీయ రహదారులను విస్తరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సూర్యాపేట-కోరుట్ల వరకు కే ఫోర్దేన్ రోడ్డు నిర్మిస్తే.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారితో, ఇటు ఆర్మూర్-జగదల్ పూర్ జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతుందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.
బండి సంజయ్ ఇది చెయ్యాల్సిందే
కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సం జయ్ కుమార్ ఇప్పటికైనా జాతీయ రహ దారుల విస్తరణపై దృష్టి సారించాలని సూచించారు. ఢిల్లీ స్థాయిలో దీనిని ఫాలో అఫ్ చేయాలన్నారు. సిరిసిల్ల మానేరు వంతెనపై రాజమండ్రి తరహాలో రైల్వే బ్రిడ్జి కం రోడ్డు మార్గం నిర్మాణానికి గతంలో మంత్రి కేటీఆర్ తో కలిసి కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరి కి ప్రతిపాదించినట్లు ఆయన గుర్తు చేశారు.
డీపీఆర్ స్థాయిలో ఉన్నప్పుడే అలైన్మెంట్ మార్చాలని సూచన
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నుంచి ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్ మెంట్ మార్చి రైల్వేలైన్ తోపాటే నిర్మించాలని వినోద్ కుమార్ కోరారు. ఈ అలైన్మెంట్ కారణంగా సిరిసిల్లలో చిన్న స్థలాల యజమానులు నష్టపోతున్నా రని, అలైన్మెంట్ మార్చి పట్టణానికి దూరంగా వేయాలని కోరారు. డీపీఆర్ స్థాయిలో ఉన్నప్పుడే మార్పులకు సాధ్యమన్నారు.ఇక జాతీయ రహదారుల విస్తరణకు భూయజమానులు సహకరించాలని, భూము లు కోల్పోయే వారికి ప్రభుత్వం పరిహారం అందించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications