BRS: వింటే చెబుదాం లేకుంటే అంతే.. అసమ్మతి నేతల పట్ల బీఆర్ఎస్ తీరు..
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో పలు చోట్లు అసమ్మతి కొనసాగుతోంది. దీంతో పార్టీ అసమ్మతి నేతలతో మాట్లాడుతోంది. వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. చెప్పినట్లు వింటే భవిష్యత్ లో పదవులు వస్తాయని భరోసా కల్పిస్తోంది. అయినా వినకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇప్పటికీ మాట వినని వారు పార్టీ వీడిన పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతోంది. దీంతో కొన్ని చోట్లు అసమ్మతి నేతలు దారిలోకి వచ్చారు.
మెదక్, నర్సాపూర్, జహీరాబాద్, కల్వకుర్తి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అసమ్మతి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎమ్మెల్యే రేఖా నాయక్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గులాబీ పార్టీ వీడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారితో బీఆర్ఎస్ అధిష్ఠానం సంప్రదింపులు జరపడం లేదని సమాచారం. మిగతా చోట్లు మాత్రం పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతోన్నారు.

ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారారు. ఆయన తనతో పాటు తన కొడుకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే కేసీఆర్ మాత్రం మైనంపల్లి ఒక్కరికే టికెట్ కేటాయించారు. దీంతో మైనంపల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి హరీష్ రావు పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమంతరావు పట్ల కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నాటికి కొంత మంది నేతలు పార్టీ వీడుతారని బీఆర్ఎస్ అంచనా వేశారు.
చెన్నూరులో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి తీవ్రంగ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీపీ బీఆర్‌ఎస్‌ను వీడారు. రామగుండంలో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అసమ్మతిని కొనసాగిస్తున్నారు. సొంతంగా సింగరేణి కార్మికులతో భేటీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications