తెలంగాణ రాజకీయాల్లోకి జగన్‌ను లాగిన కేటీఆర్ పార్టీ

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల తర్వాత జగన్ తన పార్టీని కేవలం ఏపీకే పరిమితం చేశారు. అయినప్పటికీ ఆయనపై తెలంగాణ రాజకీయ నాయకులు ఏదో సమయంలో స్పందిస్తూనే ఉంటున్నారు. ఏపీ రాజకీయాలకు ఏమాత్రం తీసిసోని విధంగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. సమంత-నాగ చైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్‌ను తెలంగాణ రాజకీయాల్లో లాగింది బీఆర్ఎస్ పార్టీ.

బీఆర్‌ఎస్ నాయ‌కుడు బాల్క‌సుమన్ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ జగన్ గురించి ప్రస్తావించారు. జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో ఆయ‌నకు విధేయులుగా ప‌నిచేసిన ఐపీఎస్ అధికారుల ప‌రిస్థితి ఇప్పుడు ఏమైందో తెలుసుకోండంటూ తెలంగాణ ఐపీఎస్ అధికారుల‌ను ఆయ‌న హెచ్చరించారు. జగన్ హయంలో ఆనాడు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన ఐపీఎస్‌లు ఇప్పుడు చంద్ర‌బాబు పాల‌న‌లో ఇంటికి వెళ్లిపోయిన విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని తెలంగాణ అధికారులను బాల్క‌సుమన్ హెచ్చరించారు.

brs leader balka suman comments on jagan rule

జ‌గ‌న్ హ‌యాంలో చేసిన తప్పుల‌కు ముగ్గురు ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించుకుంటున్నార‌ని బాల్కసుమన్ చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ అడుగులకు మ‌డుగులు అద్దిన ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. చంద్ర‌బాబు వ‌చ్చాక ఇంటికి వెళ్లారని.. మరికొందరు కేసులు ఎదుర్కొంటున్నారని సుమ‌న్ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లో కొంద‌రు ఐపీఎస్‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని బాల్కసుమ‌న్ మండిపడ్డారు. కొందరు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు వ‌ర‌కు కూడా వెళ్తామ‌ని తేల్చి చెప్పారు. తెలంగాణ పోలీసులకు స్వామిభక్తి ఎక్కువైంది. సీఎం రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇలాంటి అధికారులపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని బాల్క‌సుమన్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+