మీకు సిగ్గు, శరం ఉంటే నాకే ఓటెయ్యాలి: బీఆర్ఎస్ అభ్యర్థి షాకింగ్ కామెంట్స్!!
బీఆర్ఎస్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. గతంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని, ఓటు వేసిన వారికే ప్రభుత్వ పథకాలలో చోటు ఉంటుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఎన్నికల సమయంలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటర్లను ఉద్దేశించి రెడ్యా నాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన వ్యాఖ్యలు విన్న ఓటర్లు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అదేంటి అంత మాట అన్నాడు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఇంతకీ రెడ్యానాయక్ ఏమన్నాడు.. ఎందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి అంటే..

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న ఆయన గ్రామ గ్రామానికి తిరుగుతూ ప్రజలకు తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మైకు పట్టుకుని ప్రచార రథం పై ప్రసంగించిన రెడ్యానాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రెడ్యానాయక్ మీకు సిగ్గు శరం ఉంటే నాకే ఓటు వేయాలి అంటూ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు.తనకు ఓటు వేసిన వారి కోసం తాను నిజాయితీగా పని చేస్తున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నా, ఎక్కడికంటే అక్కడికి వస్తున్నా.. ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతున్నా.. అలాంటి తనకు మాత్రమే ఓటు వేయాలని, వేరే వాళ్లకు ఓటు వేయవద్దని పేర్కొన్నారు.
మారుమూల తండాలలో కూడా ప్రజలకు సమస్యలు ఉంటే తాను వెళ్లి పరిష్కరిస్తున్నా అని పేర్కొన్న రెడ్యానాయక్ ఓటర్లను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గం లో చర్చనీయాంశంగా మారాయి. ఇక డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి రెడ్యా నాయక్ బరిలోకి దిగగా, కాంగ్రెస్ నుండి రామచంద్రు నాయక్, బీజేపీ నుండి భూక్యా సంగీత ఎన్నికల బరిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications