Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. సైకిల్ ఎక్కనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి !

పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడినా.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయ్యారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వ్యాపారవేత్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా, ఆపై రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ భవిష్యత్‌ పై జోరుగా చర్చ నడుస్తోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్‌లో కొనసాగుతారా లేక కొత్త కండువా కప్పుకుంటారా అన్నది పెద్ద చర్చగా మారింది. ఇటీవలి కాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్‌కు దూరమవుతున్నారని, త్వరలోనే టీడీపీ (TDP) వైపు మొగ్గుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తిరుమల పర్యటన ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

brs-mla-mallareddy-going-to-join-in-telugu-desam-party

తన పుట్టినరోజు సందర్భంగా ఆయన తిరుపతికి వెళ్లగా, అక్కడ టీడీపీ నేతలు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ ఫ్లెక్సీల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫోటోలు ఉండడం గమనార్హం. దీంతో మల్లారెడ్డి టీడీపీ పగ్గాలు చేపట్టడం ఖాయమా అన్న ప్రశ్న మరింత బలపడింది. మల్లారెడ్డి పార్టీ మారితే గులాబీ పార్టీకే గట్టి షాక్ అవుతుందని అంటున్నారు.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా వెళ్తోందని, ప్రధాని మోడీ కూడా ఏపీకి లక్షల కోట్లు కేటాయిస్తున్నారని అన్నారు. గతంలో ఏపీ భూములు అమ్మేసి తెలంగాణలో కొనుగోలు చేసేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిందనిమల్లారెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రబాబును పొగడటం వెనుక ఆంతర్యం ఏమిటని రాజకీయ విశ్లేషకులు పలు కామెంట్స్ చేస్తున్నారు.

2014లో టీడీపీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున మల్లారెడ్డి ఒక్కరే గెలుపొందటం విశేషం. 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు మల్లారెడ్డి. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తిరిగి సొంత గూటికి చేరతారని.. సైకిల్ ఎక్కడం పక్కా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ నాయకత్వ బాధ్యతలు ఆయనకు అప్పగించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు.

brs-mla-mallareddy-going-to-join-in-telugu-desam-party

గత కొంతకాలంగా మల్లారెడ్డి అన్ని పార్టీలతోనూ రిలేషన్స్ మెయింటేన్ చేస్తున్నారు. గతేడాది ఆయన చంద్రబాబును కలసి తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు. ఆ తర్వాత బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. తాజాగా బోనాల సందర్భంగా ఆయన కోడలు ప్రీతి రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలవడం కూడా హాట్ టాపిక్ అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+