పార్టీ మారి తప్పు చేసాను- తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అటు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లతో సహా కాళేశ్వరం నివేదిక పైన సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. కాళేశ్వరం నివేదిక తో కేసీఆర్ ఇరకాటంలో పడటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. అటు స్థానిక సంస్థల ఎన్నికలు నెల రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. కాగా, పార్టీ మారిన గులాబీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేసారు. తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కీలక మలుపు తీసుకుంటోంది. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగానే స్పీకర్ కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెబుతున్నారు. అధికారికంగా శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అటు బీఆర్ఎస్ మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

కాగా, ఇదే అంశం పైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. ఇప్పటికే స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఆయన.. రిప్లై ఇచ్చినట్లు వెల్లడించారు. తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. అదే విషయాన్ని స్పీకర్‌కు ఇచ్చిన రిప్లైలో చెప్పానని స్పష్టం చేశారు. అప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు.. పరిస్థితుల్లో తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గ పనులు జరుగుతాయని కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కానీ పార్టీ మారి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో.. ఉంటే కిరాయి ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, హరీష్ రావు తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు. దీంతో, తిరిగి సొంత గూటికి అధికారికంగా వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక..స్పీకర్ ఈ ఎమ్మెల్యేల పైన తీసుకొనే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications