Kavitha: గుహటిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్సాం గుహటిలోని కామాఖ్య అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కవితకు ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. కవిత కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర, దేశ ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు కవిత చెప్పారు. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఆదరిస్తారని చెప్పారు.
బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని జోస్యం చెప్పారు. నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నానని కవిత గుర్తు చేసుకున్నారు. మరోసారి కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. భారత్ లో ఆధ్యాత్మికత విరజిల్లుతోందని కవిత చెప్పారు. కవిత ఆదివారం సంగారెడ్డి జిల్లా భారతి నగర్ లోని పంచముఖ అంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ఆలయ ఆవరణలో జరుగుతున్న 20వ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కల్యాణం కోసం చాతుర్మాస్య వ్రత దీక్షలను నిర్వహించడం చాలా సంతోషమని కవిత పేర్కొన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొని గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వివరించారు. కవిత గత కొద్ది రోజులుగా మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కవిత వివిధ పక్షాలతో కలిసి పోరాటం చేశారు.












Click it and Unblock the Notifications