ముగిసిన కవిత విచారణ- ఈడీ ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి..!!
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెను ఈడీ అధికారులు విచారించారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఇవ్వాళ దేశ రాజధానిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ నేపథ్యంలో- తెలంగాణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులు.. కవితను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆందోళనలు చేపట్టారు.
ఈడీ విచారణ అనంతరం ఢిల్లీ లోని తన నివాసంకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత..!!#Kavitha #ED #OneIndiaTelugu pic.twitter.com/EsmFAlKU7g
— oneindiatelugu (@oneindiatelugu) March 11, 2023
అదే సమయంలో కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనా దుమారం చెలరేగింది. మద్యం కుంభకోణానికి పాల్పడిన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

ఢిల్లీలో కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. తొమ్మిది గంటల పాటు విచారణ అనంతరం బయటికి వచ్చిన వెంటనే నేరుగా టీఎస్ 10 ఈకే 6666 నంబర్ గల కారులో తన ఇంటికి బయలుదేరి వెళ్లారు. విచారణను ముగించుకుని బయటికి వచ్చిన తరువాత ఆమె అక్కడే ఉన్న విలేకరులతో మాట్లాడతారని తొలుత భావించారు. అలా జరగలేదు. నేరుగా ఆమె తన నివాసానికి చేరుకున్నారు.
#WATCH | Delhi: BRS MLC and Telangana CM's daughter K Kavitha leaves the ED office after she was questioned by the ED officials pertaining to Delhi liquor policy case. pic.twitter.com/muNnfY9FVQ
— ANI (@ANI) March 11, 2023
కవిత నివాసం వద్ద అప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈడీ కార్యాలయం నుంచి బయలుదేరిన 15 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూడా మీడియాతో మాట్లాడటానికి పెద్దగా ఇష్ట పడలేదు. సుమారు 9 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను విచారించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ కవిత సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Delhi: BRS MLC and Telangana CM's daughter K Kavitha arrives at her residence after she was questioned by the ED officials related to Delhi liquor policy case. pic.twitter.com/3pJv8P6bAB
— ANI (@ANI) March 11, 2023
మరోవంక- కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా కల్వకుంట్ల కవితను కించపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యానాలు చేశారని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లిఖితపూరకంగా బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. బండి సంజయ్ పై ఐపీసీ 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications