వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ - పార్టీ నినాదం ప్రకటించిన సీఎం కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్ గా మారింది. కొత్త పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ అజెండా పైన ఫోకస్ పెట్టారు. ముఖ్య నేతలతో భవిష్యత్ కార్యాచరణ ఖరారు పైన చర్చలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ తక్షణం పోటీ చేసే రాష్ట్రాల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. త్వరలో ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలని సీఎం కేసీఆర్ తన లక్ష్యంగా వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అధికారికంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ విధి విధానాలపైన చర్చించారు. త్వరలోనే పార్టీ పాలసీ ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ నినాదం ఫిక్స్ చేసారు. దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిలుస్తామని వెల్లడించారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్లనున్నట్లు ప్రకటించారు. దేవ రాజకీయాల్లో పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు జరిగిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు మాత్రమేనని, రాజకీయ పార్టీలు కాదని స్పష్టం చేసారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్దిక విధానం అవసరమని సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో అభిప్రాయపడ్డారు. త్వరలోనే పార్టీ కమిటీలు ఏర్పాటు చేసే అంశం పైనా చర్చ జరిగింది.

BRS to contest from Karnataka, CM KCR key disucssions with JDS chief Kuamara Swamy

ఇక, త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కర్ణాటకలోని పది జిల్లాల్లో పోటీ అంశం పైన క్షేత్ర స్థాయిలో కసరత్తు చేసినట్లు సమాచారం. కర్ణాటకలో కమార స్వామి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్ లో పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం వేగంగా సాగుతోందని...త్వరలోనే నిర్మాణం పూర్తి చేసుకొని కార్యాలయం ప్రారంభిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. తన ప్రతీ ప్రస్థానంలో అవహేళనలు సాధరణమయ్యయని సీఎం వ్యాఖ్యానించారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. అలా ఎదురైన అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి తెలంగాణ సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రి సహచర నేతలకు గుర్తు చేసారు.

English summary
After BRD Launch CM KCR key discussions with JDS chief Kuamara Swamy and Prakash Raj along with party senior leaders on future action plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X