KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదని చెప్పారు. కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గత పదేళ్లలో గులాబీ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ఓసారి.. పార్లమెంట్ ఎన్నికల ముందు ఓసారి మోసం చేస్తున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికలు రాగానే రుణమాఫీ చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. మొదటి సారి మోసపోతే నాయకుల తప్పని.. రెండోసారి మోసపోతే ప్రజల తప్పు అని అన్నారు.

BRS working president KTR made sensational comments on Ramudu

111 జీవోను ఎత్తేసింది బీఆర్ఎస్ అని కేటీఆర్ గుర్తు చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని కోరారు. శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదని.. రాముడు అందరి దేవుడని అన్నారు. బీజేపీ ఓడిపోయినా రాముడికి ఏం కాదన్నారు. మోడీ ప్రధాన మంత్రి అయినప్పుడు సిలిండర్ ధర రూ.400 ఉందన్నారు. ఈ రోజు సిలిండర్ ధర రూ.1200 ఉందన్నారు. అయితే ప్రస్తుతం గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర రు. 900 నుంచి రూ.100 వరకు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+