రేవంత్ టార్గెట్ గా కేసీఆర్ కొత్త అస్త్రం - పాదయాత్రకు సిద్దం..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్ వేగంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ముఖ్యులు కాంగ్రెస్ బాట పడుతున్నారు. అటు బీజేపీ తమ పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఉద్యమ పార్టీగా..పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ భవిష్యత్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

కేసీఆర్ మంత్రాంగం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసారు. తాజాగా పార్టీ ముఖ్యులతో రాష్ట్రంలోని రాజకీయాల పైన చర్చించారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వీడటం పైనా స్పందించారు. అధికారం వైపు సొంత పార్టీ నేతలు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక ఉందని కేసీఆర్ చెబుతున్నారు. ప్రజల్లోనే తిరుగుబాటు మొదలైందని విశ్లేషిస్తున్నారు. గతంతో తాము అధికారంలో ఉన్న రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు.

BRS Working president KTR planning for padyatra across the state soon

పాదయాత్ర ఆలోచన
ఇదే సమయంలో పార్టీ బలహీన పడటం..నేతలు పార్టీ వీడుతున్న సమయంలో కేడర్ లో..ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. ఇందు కోసం ప్రజలతో మమేకం అయ్యేందుకు పాదయాత్ర పైన ఆలోచన చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయించాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ కు ఓటు వేసిన నిరుద్యోగ యువ, సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారని..పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లటం ద్వారా మేలు జరుగుతుందని వివరించినట్లు సమాచారం.

BRS Working president KTR planning for padyatra across the state soon

భవిష్యత్ పై భరోసా
రాష్ట్రంలో బీజేపీ ప్రభావం ఉండదని కేసీఆర్ చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకే బీజేపీ పరిమితం అయిందని..రాష్ట్రం వరకు బీఆర్ఎస్ వైపే ప్రజలు చూస్తారని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని రైతాంగం ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉందని..వారికి బాసటగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యేలా కేటీఆర్ తో పాదయాత్ర గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక..కేటీఆర్, హరీష్ పార్టీ బాధ్యతలను జిల్లాల వారీగా పర్యవేక్షిస్తారని కేసీఆర్ వెల్లడించారు. దీంతో, పాదయాత్ర పైన కేసీఆర్ తుది నిర్ణయం..ముహూర్తం ఏంటనేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+