రేవంత్ చేతులెత్తేశారు, జరిగిదిదే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మాయమాటలు చెప్పి రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తాశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను పాతిపెడతానని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని..ఇలాంటి వాళ్లను కేసీఆర్ ఎంతో మందిని చూసారని చెప్పుకొచ్చారు. ఎవరికి అన్యాయం జరిగినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

అధికారంలోకి వస్తూనే అమలు చేస్తామని నాడు రేవంత్ చేసిన హామీలను కేటీఆర్ ప్రస్తావించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని చెప్పుకొచ్చారు. 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. అప్పు తెచ్చుకోండి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడ ఆ హామీ ఎటుపోయిదని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని చెప్పారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారని వివరించారు.

BRS Working President KTR Targets CM REvanth over Six Guarantee Schemes implementation

కృష్ణా నదిలో తెలంగాణ వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదన్నారు. రాష్ట్ర వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు తెలంగాణ కృష్ణా జలాలను రేవంత్‌ రెడ్డి తాకట్టు పెట్టారని ఆరోపించారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఉండాలననారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌ ఎంపీలేనని చెప్పకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారని చెప్పారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారని వ్యాఖ్యానించారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందు ఆటో కాలబెట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ను పాతిపెడతానని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేసారు. ఎంతో మంది తీస్మార్ ఖాన్‎లను మాయం చేసి కేసీఆర్ తెలంగాణ తెచ్చారన్నారు. బీఆర్ఎస్ బాస్‎లు ఢిల్లీలోనో, గుజరాత్‎లోనో లేరని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+