ఫిర్యాదులు, పిల్లల్ని చితకబాతిన తల్లిపై పోలీస్ కేసు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:తన పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పిల్లల్ని శిశు విహార్‌కు తరలించారు. మైలార్‌దేవుపల్లిలో ఉండే మనీష (24) భర్త ఎటో వెళ్లిపోయారు. ఆమె తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. తన పేరును మనీషా బేగంగా మార్చుకుంది. స్థానికంగా ఇళ్లలో పనులు చేస్తుంది.

కాగా ఆమె పనులకు వెళ్లినపుడు పిల్లలు చేసే అల్లరిపై ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో పాటు ఆమెపై ఆగ్రహించేవారు. నెలరోజులుగా ఇదే తంతు కావడంతో మనీషా పిల్లలను ఇష్టారీతిన చితకబాదడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగ పట్టుకొని మృతి

సెల్‌ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకుని ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నాడు చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌లో నివాసముండే రాకేశ్ చంద్ర (19) ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

BTech student died While talking on Phone

శనివారం వనస్థలిపురం ప్రశాంత్ నగర్ కాలనీలో నివాసముండే తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. మొదటి అంతస్తు బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న రాకేశ్ ఫోన్‌లోనే లీనమయ్యాడు. పక్కనున్న హైటెన్షన్ తీగలను ముట్టుకోవడంతో షాక్ తగిలి పడిపోయాడు.

BTech student died While talking on Phone

తీవ్రగాయాలైన రాకేష్‌ను హుటహుటిన స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ అతను మృతి చెందాడు. రాకేష్ చంద్ర అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన విద్యార్థి. ఇతను ఎల్పీ నగర్‌లోని కామినేని ఆసుపత్రి సమీపంలో ఉంటూ చదువుకుంటున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BTech student Rakesh Chandra died While talking on Phone.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి