భాగ్యనగరానికి బడ్జెట్ వరాలు.. మెట్రో రైల్వేకు భారీగా నిధులు!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేడు అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లుగా, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లుగా భట్టి విక్రమార్క పద్ధతులను ప్రవేశపెట్టారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు
2024 - 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో భాగ్యనగరం అభివృద్ధికి భారీగానే నిధులను కేటాయించినట్టుగా భట్టి విక్రమార్క బడ్జెట్ లెక్కలలో చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్లో పాతబస్తీ మెట్రో విస్తరణకు కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ఈ కేటాయింపులతో తెలిపారు.

పాతబస్తీ మెట్రో విస్తరణకు 500 కోట్లు
పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టంకు 50 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇదే సమయంలో మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం 1500 కోట్ల రూపాయలు, ఇక హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసం 10వేల రూపాయల కోట్ల కేటాయించినట్లు తెలిపారు. ఇందులో జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పన కోసం 3065 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు
హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కు 3385కోట్లు, హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 200కోట్ల రూపాయలు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ దగ్గర సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హైదరాబాద్ నగరాన్ని మెట్రోపాలిటన్ నగరంగా ముందు వరుసలో నిలపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నదన్నారు.
బడ్జెట్ ప్రసంగానికి ముందు గత ప్రభుత్వంపై భట్టి ఫైర్
బడ్జెట్ ప్రసంగానికి ముందు గత ప్రభుత్వం పై విరుచుకుపడిన భట్టి విక్రమార్క గత పదేళ్ళ అస్తవ్యస్త పాలనకు, తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. గత పాలకులు బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారని విమర్శించారు. గత ప్రభుత్వం అన్ని రంగాలలోనూ విఫలమైందని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని నిప్పులు చెరిగారు గత పదిలల్లో ప్రభుత్వ పదిరెట్లు పెరిగిందని ఓవైపు అప్పులు పెరగగా మరోవైపు బిల్లుల బకాయిలు పెరిగిపోయాయని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్చిన్నం చేశారని భట్టి విక్రమార్క కేసీఆర్ సర్కార్ పైన నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications