వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికారాబాద్‌లో వింత... రెండు తలలతో జన్మించిన దూడ... చూసేందుకు క్యూ కడుతున్న జనం...

|
Google Oneindia TeluguNews

వికారాబాద్ జిల్లాలో వింత చోటు చేసుకుంది. ఓ గేదె రెండు తలల దూడకు జన్మనిచ్చింది. విషయం తెలిసి ఆ దూడను చూసేందుకు స్థానికులు అక్కడికి క్యూ కడుతున్నారు.జన్యుపరమైన లోపంతోనే దూడ రెండు తలలతో పుట్టినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన వీరారెడ్డి గేదెలను పెంచుతున్నారు. ఇటీవల ఈతకు వచ్చిన ఓ గేదె ప్రసవ వేదనతో ఇబ్బందిపడుతుండటంతో... వీరారెడ్డి స్థానిక పశువైద్యుడిని పిలిపించాడు. ఆ వైద్యుడు గేదెను పరీక్షించి దాని కడుపులో రెండు తలల దూడ ఉన్నట్లు నిర్దారించారు. అనంతరం జాగ్రత్తగా దూడను కడుపు నుంచి బయటకు తీశారు.

రెండు తలల దూడ పుట్టిందని తెలియగానే స్థానికులు దాన్ని చూసేందుకు ఎగబడ్డారు.అయితే దూడ బలహీనంగా ఉండటంతో అది నడవలేని స్థితిలో ఉంది. జన్యుపరమైన లోపాలతోనే ఇలాంటి దూడలు పుడుతాయని పశు వైద్యాధికారి వెల్లడించారు.

buffalo calf born with two heads in vikarabad district

గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, రెడ్డి గూడెం మండలం, రుద్రవరం గ్రామంలోనూ ఇలాంటి వింతనే చోటుచేసుకుంది. స్థానిక గరికపాటి వెంకటేశ్వరావు ఇంటిలో నెలల నిండిన ఆవు ప్రసవించగా... రెండు తలలతో కూడిన దూడ జన్మించింది. దూడ రెండు తలలు బాగానే పనిచేస్తుండటంతో ఆ ఇంటివాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా ఊరంతా పాకడంతో స్థానికులు ఆ దూడను చూసేందుకు తండోప తండాలుగా తరలివెళ్లారు.

ఇవి మాత్రమే కాదు,ఇలా రెండు తలలతో మేకలు,ఆవులు,గేదెలు పుట్టిన ఘటనలు గతంలోనూ చాలానే చోటు చేసుకున్నాయి. జన్యుపరమైన లోపాల వల్లే ఇలా రెండు తలలు లేదా ఉండాల్సిన అవయవాల కంటే ఎక్కువ,తక్కువలతో పుట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పశువుల్లోనే కాదు కొన్నిసార్లు మనుషుల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుంటాయి. జన్యు లోపాల వల్ల శిశువులు మూడు కాళ్లతో పుట్టిన ఘటనలు గతంలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే.

అమెరికాకు చెందిన మైర్‌ట్లే కార్బిన్ అనే మహిళ నాలుగు కాళ్లు,రెండు జననేంద్రియాలతో పుట్టి దాదాపు 60 ఏళ్లు బతికింది. ఆమె ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది.మైర్‌ట్లే కార్బిన్ వైద్య శాస్త్రానికే ఓ మిరాకిల్‌ అని చెబుతారు.సాధారణంగా జన్యు లోపాలతో పుట్టేవారు బతికే అవకాశాలు చాలా తక్కువ. కానీ కార్బిన్ 60 ఏళ్ల పాటు బతికింది. కార్బిన్ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు... పిండం స‌రిగ్గా వృద్ధి చెంద‌క‌పోవ‌డం వ‌ల్ల క‌వ‌ల‌లుగా పుట్టాల్సిన శిశువులు ఒక్క‌రిగా పుట్టడం వల్లే ఆమెకు నాలుగు కాళ్లు,రెండు జననేంద్రియాలు,రెండు గర్భాశయాలు... ఉన్నాయని వైద్యులు తేల్చారు.

English summary
In a strange incident, a buffalo gave birth to a two-headed calf. The locals are queuing up to see the calf. It seems that the calf was born with two heads due to a genetic defect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X