వంతెనపైనుంచి బోల్తా పడిన బస్సు: 10మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సారపాక-నాగినేనిప్రోలు మార్గంలో ఆర్టీసీ బస్సు వాగు వంతెనపైనుంచి అదుపు తప్పి బోల్తా పడింది.

శనివారం ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్డుపై గుంతలను తప్పించబోయి బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పది మందికి గాయాలైనట్లు తెలిసింది.

Bus accident in Reddypalem: 10 injured

పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా, భారీ వర్షాలతో జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+