45మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడికి చేరిన బస్సు డ్రైవర్.. కన్నీరు పెట్టిన ప్రయాణీకులు!!
ప్రాణాలు పోతున్నా బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడటానికి ఓ బస్సు డ్రైవర్ చేసిన పని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒక టూరిస్ట్ బస్సు కు చెందిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడడానికి చేసిన పని అతడిని, బస్సులో ప్రయాణికుల పాలిట దేవుడిని చేసింది. 45 మంది ప్రయాణికులను కాపాడి, తాను ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్ బస్సులోని ప్రయాణికులు అందరినీ కంట తడి పెట్టించారు.

ప్రయాణీకులను కాపాడిన బస్సు డ్రైవర్
ఇంతకు ఏం జరిగిందంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం సుందరయ్య కాలనీ మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒక బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఆపై డ్రైవర్ తన సీట్లోనే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో ప్రయాణీకులకు ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికీ ఎటువంటి గాయాలు లేకుండా ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ మార్గంలో ఇసుక లారీలు ఎక్కువగా వస్తున్న క్రమంలో విపరీతమైన గుండెపోటుకు గురైన బస్సు డ్రైవర్ పెను ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడి తాను ప్రాణాలు కోల్పోయాడు.

ఎదురుగా వస్తున్న ఇసుక లారీలను తప్పించి డ్రైవర్ సాహసం
మృత్యువు దరి చేరుతున్నా, ఎదురుగా వస్తున్న ఇసుక లారీలను తప్పించి, బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి డ్రైవర్ తెగువ చూపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణ పల్లి కి చెందిన 45 మంది తమిళనాడులో తీర్థయాత్రకు వెళ్లి, తిరుగు ప్రయాణంలో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఇక భద్రాచలం నుండి యాదాద్రి కి బయలుదేరిన వారి ప్రయాణం సాఫీగా సాగుతుంది అనుకుంటే ఊహించని అవాంతరం వచ్చి పడింది.

పొదల్లోకి వెళ్ళిన బస్సు.. సీట్లోనే కుప్పకూలిన డ్రైవర్
డ్రైవర్ ఒక్కసారిగా బస్సును పక్కనే ఉన్న పొదల్లోకి నడపడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అసలు విషయం ఏమిటంటే తీవ్రమైన గుండెపోటుతో డ్రైవర్ బస్సులోనే కుప్పకూలిపోయాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా పొన్ని గ్రామానికి చెందిన డ్రైవర్ జే. దేవాయిరక్కం అంతకుముందు గుండెలో కాస్త మంటగా ఉంది అని చెప్పి కాసేపు బస్సును ఆపాడు. ఆపై మరలా బస్సును ముందుకు పోనిచ్చిన తీవ్రంగా గుండెపోటు రాగా ఎదురుగా వస్తున్న ఇసుక లారీని తప్పించి, రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయారు. ఆపై డ్రైవర్ సీట్లోనే కుప్పకూలిపోయాడు.

బస్సు డ్రైవర్ మృతి చెందటంతో కన్నీరు మున్నీరు అవుతున్న ప్రయాణికులు
బస్సు తక్కువ స్పీడ్ గ ఉండటం, డ్రైవర్ నొప్పిగా ఉన్నా బస్సు కు బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే బస్సు డ్రైవర్ ను ఆసుపత్రికి తీసుకెళ్ళినా లాభం లేకపోయింది. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన డ్రైవర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ తనకు ఎంత నొప్పిగా ఉన్నా, సమయస్ఫూర్తితో బస్సును పక్కకు తీసి బ్రేక్ వేశాడని, లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు. తమ ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ మృతి చెందడం పట్ల ప్రయాణికులందరూ కన్నీటిపర్యంతమయ్యారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications