తప్పిన పెను ప్రమాదం: మూసాపేట ఫ్లైఓవర్ పైనుంచి పడిపోయిన బస్సు
హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున మూసాపేట ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. సెయింట్ అనే సంస్థకు చెందిన సోని ట్రావెల్స్ ఫ్లైఓవర్ పై అదుపు తప్పి కిందపడిపోయింది.
ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు అంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఫ్లైఓవర్ రైలింగ్ ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.

మాదాపూర్ నుంచి కూకట్‌పల్లి మీదుగా అమీర్‌పేట్ వెళ్తున్న ఆ బస్సు.. రాంగ్ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications