వ్యాపారి కిడ్నాప్: వ్యాపారలావాదేవీలే కారణమా?
హైదరాబాద్: హైదరాబాదు నగరశివారు కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని దూలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కిడ్నాప్ సంచలనం సృష్టించింది. గురువారం రాత్రి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దూలపల్లికి చెందిన జైనాధ్‌గౌడ్ సోదరుడు నవీన్‌గౌడ్(30) పాత కార్ల క్రయ విక్రయాలు జరుపుతుంటాడు.
అతనొక్కడే కాకుండా చింతల్‌కు చెందిన స్నేహితులు సదీప్‌గౌడ్, కిట్టు, ఇర్ఫాన్‌తో కలిసి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. 13న మధ్యాహ్నం ఎర్రగడ్డ భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన మరో కార్ల వ్యాపారి చిన్నారెడ్డి అలియాస్ చెన్నప్ప మరో నలుగురిని ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. లిమ్రా ఫంక్షన్‌హాల్ వద్దకు రావాలని కోరగా నవీన్‌గౌడ్, సదీప్‌గౌడ్, కిట్టు, ఇర్ఫాన్ వెళ్లారు.

అందరు కలిసి అక్కడకు వెళ్లిన తర్వాత నవీన్‌గౌడ్ ఒక్కడే రావాలని చెన్నప్ప చెప్పడంతో ఒక్కడే ఫంక్షన్‌హాల్ నుంచి మరికొంత దూరం వెళ్లాడు. తదనంతరం ఫోన్ చేయగా స్విఛాఫ్ వచ్చింది. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
పోలీసులు చెన్నప్పకు ఫోన్ చేస్తే తాను కడప జిల్లా వాసినని, తన కుటుంబంతో కలిసి కడపకు వెళ్తున్నట్లు ఫోన్‌లో సమాచారం ఇస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. చెన్నప్ప నవీన్‌కు మధ్య సుమారు నాలుగు కోట్ల లావాదేవీలున్నాయని సమాచారం.పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications