వీడిన వ్యాపారి హత్య కేసు మిస్టరీ: కూర రాజన్న ప్రధాన పాత్రధారి
హైదరాబాద్: క్రషర్ వ్యాపారి కృష్ణమోహన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జనశక్తి మాజీ నేతలు ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారించారు. వ్యాపార లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో మాజీ జనశక్తి అగ్రనేత కూర రాజన్న ప్రధాన పాత్ర పోషించినట్లు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
కాల్పులు జరిపిన మరో మాజీ జనశక్తి నక్సలైట్లతో పాటు నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. గురువారం నేరేడ్‌మెట్‌లోని మల్కాజిగిరి జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిని మీడియా సమావేశంలో డీసీపీ రాంచంద్రా రెడ్డి,అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీఖ్‌లు వివరాలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంతాయిపల్లిలో శ్రీ బాలాజీ మెటల్ కంపెనీ పేరుతో కృష్ణ మోహన్ రావు ఇసుక వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. స్నేహితుడు జలగం శ్రీనివాస రావుతో కలిసి 2000 నుంచి 2004 సంవత్సరం వరకు ఇద్దరు కలిసి ఇసుక వ్యాపారం చేశారు. కృష్ణ మోహన్‌తో పాటు జలగం శ్రీనివాస రావు బంధువు వెంకటేశ్వర రావు కలిసి మాదాపూర్, హైటెక్‌సిటి, శిల్పారామం వద్ద ప్లాట్‌లు కొన్నారు.

వీరందరూ కలిసి 295 గజాల్లో భవనం నిర్మించి ఓ ఆసుపత్రికి అద్దెకు ఇచ్చారు. దాని పక్కనే 600 గజాల్లో 24ప్లాట్స్ కట్టి కిరణ్ రెడ్డికి లీజుకు ఇచ్చారు. ప్రతి ఫ్లాట్‌కు నెలకు రూ.13వేల అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని హాస్టల్‌కు అద్దెకిచ్చారు. భవనాల నిర్మాణంలో శ్రీనివాసరావు డబ్బును పెట్టుబడిగా పెట్టలేదు. అయితే శ్రీనివాసరావు హాస్టల్ నుంచి వచ్చే అద్దెను తీసుకునే వాడు. ఇలా శ్రీనివాస్‌రావు కృష్ణమోహన్‌కు 47లక్షలు బాకీ పడ్డాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో తన స్నేహితులు నారాయణ రావు, మాజీ సర్పంచి బాల్‌రెడ్డి కలిసి జనశక్తి లీడర్ కూర రాజన్నను ఆశ్రయించారు. కృష్ణ మోహన్‌ను హత్య చేయడానికి స్కెచ్ వేశారు. దీంట్లో భాగంగా రాజన్న అనుచరుడు నాగరాజుతో శ్రీనివాస్‌రావు డీల్ కుదుర్చుకున్నాడు.
డిసెంబర్ 18న కృష్ణమెహన్ రావు కారులో అంతాయపల్లి లోని శ్రీ బాలాజీ మెటల్ కంపెనీకి వస్తుండగా శ్రీనివాస్‌తో పాటు నాగరాజు మూఠా సభ్యులు కలిసి అతనిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు .ప్రమాదం పసిగట్టిన కృష్ణ మోహన్ రావు కారులో నుంచి బయటికి దూకడానికి ప్రయత్నిస్తుండగా, నాగరాజు పిస్తోల్‌తో కాల్చాడు. ఘటనా స్థలంలోనే కృష్ణ మోహన్ రావు మృతి చెందాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది మంది నిందుతులను గుర్తించారు. వీరిలో జలగం శ్రీనివాస్ రావు, బండి యాదయ్య, నారాయణ, వెలుమ బాలిరెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజన్న మరికొందరు పరారీలో ఉన్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications