ఆ సైట్లలో వస్తువులు కొంటున్నారా? అయితే ముందే డబ్బులు చెల్లించకండి: పోలీసుల హెచ్చరిక
దేశంలో పెరిగిపోయిన టెక్నాలజీతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నిత్యం ప్రజల్లో అవగాహన కల్పించటానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏవిధంగా సైబర్ నేరాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలి అన్న విషయాలను పోలీసులు ప్రజలకు అర్థమయ్యేలా వీడియోలు, పోస్టులతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఆన్లైన్ లో షాపింగ్.. పెరిగిపోయిన సైబర్ నేరాలు
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు షాపింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లో కూర్చొని ఫోన్లో నుండే మనకి కావాల్సిన వస్తువులను ఈ కామర్స్ సైట్ల నుండి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. నిత్యవసర వస్తువులు దగ్గర నుంచి కూరగాయల వరకు ప్రతి ఒకటి డోర్ డెలివరీ అయ్యే పరిస్థితి ప్రస్తుతం పెరిగిన ఆధునిక టెక్నాలజీతో కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకుని చేస్తున్న నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ కామర్స్ సైట్ లో మనకు అవసరమైన వస్తువుల కొనుగోలు చేసే క్రమంలో వినియోగదారులను బురిడీ కొట్టిస్తూ దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు కూడా గణనీయంగా పెరిగిపోయారు.

ఓఎల్ఎక్స్, క్వికర్, కార్ దేఖో వంటి సైట్ల ద్వారా సైబర్ మోసాలు
ఆన్లైన్ లో వస్తువులు కొనుగోలు చేసేముందు జాగ్రత్తగా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. మనం ఏ వస్తువునైనా కొనుగోలు చేయాలన్నా, సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేయాలన్న దాదాపు ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఓఎల్ఎక్స్, క్వికర్, కార్ దేఖో వంటి వెబ్‌సైట్లలో సెకండ్ హ్యాండ్ వస్తువులను, కార్లను విక్రయిస్తుంటారు. అయితే ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లను సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాల కోసం ఉపయోగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.

వస్తువులను డైరెక్టుగా చూడకుండా డబ్బులు చెల్లించవద్దు
తాము అమ్మదలుచుకున్న వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లలో పెట్టి, కొనుగోలు చేసే ఆసక్తి ఉన్న వారిని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. సైట్ లో పెట్టిన ఫోటోలను చూసి మోసపోయి, వాటిని కొనుగోలు చేయడానికి ఆన్లైన్ లో డబ్బులు చెల్లింపు చేస్తున్న వినియోగదారులు సైబర్ మోసాలకు గురవుతున్నారు. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులు వస్తువులను డైరెక్టుగా చూడకుండా, అమ్మే వ్యక్తులను డైరెక్టుగా కలవకుండా ముందుగా డబ్బులు చెల్లించవద్దు అని సూచిస్తున్నారు.

వస్తువు నేరుగా చూడకుండా ఐడి ప్రూఫ్స్ పంపినా డబ్బులు పంపకండి
కొనుగోలుదారులను నమ్మించడం కోసం సైబర్ నేరగాళ్ళు ఐడి ప్రూఫ్ పంపిస్తారని, వారు ఐడి ప్రూఫ్స్ చూపించినా సరే డబ్బులు పంపకండి. జాగ్రత్త వహించండి అంటూ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవటంతో పాటుగా, టెక్నాలజీతో జరిగే మోసాలను గ్రహించడంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని చెబుతున్నారు. అందుకే ఆన్లైన్లో ఓఎల్ఎక్స్ క్వికర్, కార్ దేఖో వంటి సైట్లలో కొనుగోలు చేసేటప్పుడు ముందుగా డబ్బులు చెల్లించవద్దని, వస్తువులు ఫిజికల్ గా చూసిన తర్వాతనే నేరుగా చెల్లింపులు చేయాలని సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications