రైతు భరోసా అమలు వీరికే - మార్గదర్శకాలు, పరిమితి ఖరారు..!!
రైతు భరోసా అమలు పైన ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ రోజు మరోసారి సమావేశం కానుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చేసే సిఫార్సులకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఇప్పటికే సంక్రాంతికి నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అర్హుల ఖరారుకు మార్గదర్శకాలు సిద్దం అయ్యాయి. పథకం అమలు పరిమితి పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి నిధుల జమకు ప్రభుత్వం సిద్దం అవుతోంది.
నేడు కీలక భేటీ
రైతుభరోసా అమలు పైన రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంక్రాంతికి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ఆర్దికంగా నిధుల సమీకరణ కొనసాగిస్తూనే .. అర్హతల పైన తుది కసరత్తు జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘం నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాగు చేసే భూములకే భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సాగు చేయని భూములను ఇస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయటమే అనే అభిప్రాయం తో ప్రభుత్వం ఉంది.

పరిమితి ఎంత
అయితే, సాకుకు సంబంధించి నేరుగా రైతుల నుంచే డిక్లరేషన్ తీసుకోవాలనే ప్రతిపాదన పైన చర్చ సాగుతోంది. గతంలో చేసారా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా. .ప్రస్తుతంగా సాగు లో ఉన్న భూములను రైతు భరోసా ఇవ్వనున్నారు. అయితే, పరిమితి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత పది ఎకరాల వరకు పరిమితం చేయాలనే మెజార్టీ అభిప్రాయం వచ్చినా.. మొత్తంగా రాష్ట్రంలో సాగులో ఉన్న భూములు.. రైతులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన తరువాత ఏడు ఎకరాలకు పరిమితం చేసే అంశం పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. అయితే, వచ్చే కేబినెట్ సమావేశంలో పరిమితి పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది కసరత్తు
రైతులకు ప్రతి ఏటా రెండు విడతలుగా రూ.7500 సాయం అందించడానికి సంక్రాంతి నాటికి ఈ పథకం ప్రారంభించాలని సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇక సాగు భూములు కచ్చితంగా గుర్తించేందుకు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వినియోగంపై సైతం ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సర్వే నెంబర్లు ఆధారంగా భూమి హక్కు దారుల వివరాలను గుర్తిస్తోంది. అయితే అదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజా ప్రతినిధులకు.. ఈ పథకం వర్తించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం తరహాలో.. ఈ పథకాన్ని సైతం అమలు చేయ్యాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications