మా ఉద్యోగివి కాదు, డబ్బులివ్వం: ఈసీ భన్వర్ లాల్‌కు తెలంగాణ షాక్
తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌కు ఇంచార్జ్ అలవెన్సులు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. తద్వారా ఆయనకు కేసీఆర్ ప్రభుత్వం షాకిస్తోంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌కు ఇంచార్జ్ అలవెన్సులు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. తద్వారా ఆయనకు కేసీఆర్ ప్రభుత్వం షాకిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం భన్వర్ లాల్‌ను ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ, తెలంగాణకు ఇంచార్జ్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెండు రాష్ట్రాలకూ పని చేస్తున్నారు.
ఏదైనా విధుల్లో ఉన్న అధికారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తే, వేతనంలో 20 శాతాన్ని ఇంచార్జ్ అలవెన్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.

భన్వర్ లాల్ వేతనం నెలకు రూ. 2.25 లక్షలు కాగా, తెలంగాణ సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నెలకు రూ. 45 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా, ఆ మొత్తం ఇప్పుడు రూ.16 లక్షలకు పెరిగింది. తన ఇంచార్జ్ అలవెన్స్ చెల్లించాలని భన్వర్ లాల్ లేఖ రాయగా, ఆయన తెలంగాణ ఉద్యోగి కాదని, తమ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి కాని వారికి అలవెన్స్‌లు ఇవ్వలేమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications