ఆ మూడు స్థానాల్లో నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేం..! అన‌ర్హ‌త ఎమ్మెల్సీల అంశంలో కోర్టుకు స్ప‌ష్టం చేసిన ఈసీ..!

హైదరాబాద్‌: అన‌ర్హ‌త వేటు ప‌డిన ముగ్గురు ఎమ్మెల్సీల ప‌ట్ల ఎన్నిక‌ల సంఘం ఆచి తూచి అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదికార గులాబీ పార్టీలో వేటు ప‌డిన ముగ్గురు ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటీఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేక పోతున్న‌ట్టు కోర్టుకు స్ప‌ష్టం చేసింది ఎన్నిక‌ల సంఘం. ముగ్గురు ఎమ్మెల్సీల‌కు సంబందించి కేసు కోర్టులో విచిర‌ణ‌లో ఉన్నందున, విచార‌ణ పూర్త‌యిన నేప‌థ్య‌లోనే త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. దీంతో అన‌ర్హ‌త వేటు ప‌డిన ఎమ్మెల్సీలు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది.

3 ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయలేం..! హైకోర్టుకు నివేదించిన ఎన్నికల కమిషన్..!!

3 ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయలేం..! హైకోర్టుకు నివేదించిన ఎన్నికల కమిషన్..!!

అనర్హత వేటు పడిన ముగ్గురు ఎమ్మెల్సీలకు సంబంధించిన సీట్ల భర్తీకి ఇప్పుడే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదని ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఆ స్థానాల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పాయి. కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తూ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్‌ చేస్తూ యాదవరెడ్డి, రాములు నాయక్‌ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ విచారించారు.

త‌న‌పై పై ఎలా వేటు వేస్తారు..!తాను ఏ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాదంటున్న రాములు నాయ‌క్..!!

త‌న‌పై పై ఎలా వేటు వేస్తారు..!తాను ఏ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాదంటున్న రాములు నాయ‌క్..!!

రాములు నాయక్‌ను సమాజ సేవ చేసినందుకు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారని, ఆయనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదనలు వినిపించారు. రాములు నాయక్‌ నామినేషన్‌ సమయంలో ఏ పార్టీకీ చెందని వారిగా పేర్కొన్నారని, ఆ పత్రాలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కోరినా శాసనమండలి కార్యాలయం అధికారులు స్పందించలేదని వివరించారు.

స‌మ‌గ్ర విచార‌ణ లేకుండా వేటు వేసారన్న ఎమ్మెల్సీలు..! న్యాయం చేయాల‌ని కోర్టుకు నివేద‌న‌..!!

స‌మ‌గ్ర విచార‌ణ లేకుండా వేటు వేసారన్న ఎమ్మెల్సీలు..! న్యాయం చేయాల‌ని కోర్టుకు నివేద‌న‌..!!

నాలుగు వారాలు గడువు ఇస్తే తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని నిరూపించుకుంటామని కోరినా పట్టించుకోకుండా ఏకపక్షంగా అనర్హత వేటు వేశారన్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలిశారనే పత్రికా కథనాల ఆధారంగా యాదవరెడ్డిపై అనర్హత వేటు వేశారని సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఢిల్లీకి వెళ్లలేదని, రాహుల్‌గాంధీని కలవలేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై ఎలాంటి చర్యలు చేపట్టని స్పీకర్‌ కార్యాలయం టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లారనే ఆరోపణలపై వీరిపై వెంటనే చర్యలు చేపట్టిందన్నారు.

 పిటిషన్లను ధర్మాసనానికి పంపిన జడ్జి..! కీల‌క తీర్పు వెలువ‌డే అవ‌కాశం..!!

పిటిషన్లను ధర్మాసనానికి పంపిన జడ్జి..! కీల‌క తీర్పు వెలువ‌డే అవ‌కాశం..!!

అనర్హతపై ఇప్పటికే దాఖలైన ఓ పిటిషన్‌ను ధర్మాసనం విచారిస్తోందని, అనర్హతను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రెండు నెలల్లో పరిష్కరించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని ప్రస్తావించారు. వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదన్న ఎన్నికల కమిషన్‌ మాటను నమోదు చేసుకొని, పిటిషన్లను ధర్మాసనం ముందుంచాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+