భయపెడుతున్న మైనర్లు: కారుతో బీభత్సం, కారుపై ఎగిరిపడ్డ వ్యక్తి

హైదరాబాద్‌: నగరంలో ఇప్పటికే మద్యం మత్తులో వాహనాలు నడిపిన యువకులు.. పలువురి మరణానికి కారణమయ్యారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమో, లేక వారి విచ్చలవిడి తనమో గానీ, జనం ప్రాణాలకు మాత్రం వీరితో ముప్పు వాటిల్లుతోంది.

ఇటీవల మైనర్లు మద్యం మత్తులో కారు నడిపి రమ్య అనే చిన్నారితోపాటు ఆమె బాబాయ్, తాత మరణానికి కారణమైన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం మరో ఘటనలో తల్లీకూతుళ్లను కారు ఢీకొనడంతో తీవ్రగాయాలతో వారు ఆస్పత్రి పాలయ్యారు. సంజన అమ్మాయి దాదాపు 20 రోజలు చికిత్స అనంతరం కోలుకుంది. ఇలా మైనర్లు, యువకులు మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చేవారి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు.

 Car accident: one injured

తాజాగా జరిగిన ఇలాంటి ఘటనే స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. అభిషేక్‌(18) తన నలుగురు మిత్రులతో కలిసి మద్యం తాగి స్కోడా కారులో వెళ్తూ శనివారం ఉదయం అంబర్‌పేట డీడీకాలనీలో నాలుగు కార్లు, ఒక బైక్‌ను ఢీకొట్టి స్థానికులను భయ బ్రాంతులకు గురిచేశాడు.

ఈ ఘటనలో కారు ఢీకొని ఓ వ్యక్తి సినీ ఫక్కీలో ఎగిరి ఢీకొట్టిన కారుపై పడి అక్కడి నుంచి నేలమీద పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన యువకుడు అభిషేక్‌కు కూడా గాయాలవడంతో పోలీసులు అదుపులోకి తీసుకిని ఆసపత్రికి తరిలించారు. అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+