హైదరాబాద్‌లో మరో హిట్ రన్: 2 బైక్‌లపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి స్పోర్ట్స్ కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. దీంతో ఓ వాహనంపై ఉన్న అన్నాచెల్లితోపాటు, మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తర్వాత నిందితుడు అక్కడ్నుంచి కారుతో సహా పరారయ్యాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Car hits two bikes in Jubilee hills, Hyderabad: three injured


తండ్రి ఆటో ఢీకొని బాలుడి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు తండ్రి నడిపే ఆటో ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆటో నడుపుతూ జీవనం సాగించే వరిగంజి మురళీకృష్ణ కుమారుడు రిషిక్(4) ఉన్నాడు.

బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఆటోను వెనక్కు మళ్లించే సమయంలో.. అక్కడు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా వెనక్కి రావడంతో తీవ్రగా గాయపడ్డాడు. వెంటనే గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమారుడి మరణానికి కారణమైన ఆ తండ్రి రోదనలు మిన్నంటాయి. అక్కడున్నవారిని కలచివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+