SRSP: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. భార్య, భర్త, తమ ఇద్దరు పిల్లలతో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, భర్త మరణించగా.. మహిళను స్థానికులు కాపాడారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమవారపు ప్రవీణ్ (34) తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి(4), కుమారుడు ఆర్యవర్ధన్ సాయి(5)తో కలిసి హనుమకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు గుండెనొప్పి వచ్చింది.

ఈ నేపథ్యంలో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. నొప్పి ఎక్కువైంది. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కుమారుడు మృతి చెందగా, అతని మృతదేహాన్ని బయటకు తీశారు. కారుతో సహా ప్రవీణ్, చైత్యసాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
స్థానికుల సయాంతో కృష్ణవేణి ప్రాణాలతో బయటపడింది. కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించిన పోలీసులు.. గత ఈతగాళ్ల సాయంతో కారుతో సహా కొట్టుకుపోయిన ప్రవీణ్, చైత్రసాయిని గుర్తించారు. జేసీబీ సాయంతో కారును బయటకు తీసుకొచ్చారు. ప్రవీణ్, చైత్రసాయి మృతదేహాలను బయటకు తీశారు. భర్తతోపాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో కృష్ణవేణి కన్నీరుమున్నీరుగా విలపించింది.












Click it and Unblock the Notifications