టపాసుల చిచ్చు: ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌పై హత్యాయత్నం కేసు
హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేకానంద్ గౌడ్‌కు తన సొంత బాబాయి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు (డీసీసీ చీఫ్) కేఎం ప్రతాప్ గౌడ్‌తో విభేదాలున్నాయి.

హైదరాబాద్ శివారులోని చింతల్‌లో వీరిద్దరికి సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ సూచన మేరకు హరికృష్ణ అనే వ్యక్తి టపాసుల దుకాణం ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న కేఎం ప్రతాప్ కుమారుడు కేపీ విశాల్, వివాదాస్పద స్థలంలో దుకాణం ఎలా ఏర్పాటు చేశావని హరికృష్ణను నిలదీశారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరగడంతో వివేకానంద గౌడ్ ఆగ్రహాంతో విశాల్‌పై చేయి చేసుకున్నారు. దీంతో వివేకానంద గౌడ్ తనపై దాడి చేశారని, తనను హత్య చేసేందుకు యత్నించారని విశాల్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వివేకానంద్ గౌడ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టపాసులతో పాటు డబ్బులు ఇవ్వాలని తనను బెదిరించారని టపాసుల దుకాణ యజమాని హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాల్‌పై పలు కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications