టిలో వదలని జగన్ పార్టీ, ఇంటర్వ్యూ ఎఫెక్ట్: కోడెలపై కరీంనగర్ కోర్టులో కేసు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదయింది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నికయ్యేందుకు రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రీంనగర్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదయింది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నికయ్యేందుకు రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొద్ది రోజుల క్రితం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 20వ తేదీన కరీంనగర్ కోర్టుకు హాజరు కావాలని కోడెలకు సమన్లు జారీ చేశారు.

kodela siva prasad rao

ఎన్నికల్లో అంత మొత్తం ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఈ విషయమై కోడెలపై చర్యలు తీసుకోవాలని కోరితూ వైసిపి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర రెడ్డి గతంలో హైకోర్టును అశ్రయించారు.

ఈ మేరకు న్యాయస్థానం భాస్కర రెడ్డి ఫిర్యాదును స్వాకరించింది. కోడెల పైన కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. దీంతో మంగళవారం నాడు స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 171ఈ, 171ఎఫ్, 171బీ, 171హెచ్, 171ఐ, 200 ఐపీసీల కింద కేసు నమోదు చేశారు. సమన్లు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+