కంగనా రనౌత్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు: తాజా వివాదాస్పద వ్యాఖ్యలే కారణం
హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కంగనాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కంగనా రనౌత్ దిష్టబొమ్మలను తగలబెట్టారు. మరికొన్ని చొట్ల ఆమె దిష్టిబొమ్మలను చెప్పుతో కొడుతూ నిరసనలు తెలిపారు.
భారతదేశానికి నిజమైన స్వాతంత్రం 2014లో వచ్చందని.. 1947లో వచ్చింది బిక్ష మాత్రమేనని కంగానా రనౌత్ ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనను అరెస్ట్ చేయాలని.. వెంటనే ఆమెకు ఇచ్చిన పద్మ శ్రీని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే జనాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినా కంగానా మాత్రం వెనక్కితగ్గడం లేదు. మరోసారి తన మాటలను సమర్దించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలైతే, తాను వేసిన ప్రశ్నలకు సమాధానాలు దొరికితే తానే స్వయంగా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని స్పష్టం చేశారు.
అయితే, కంగానా చేసిన వ్యాఖ్యలపై దేశంలోని పలుచోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ కేసు నమోదైంది. దేశ స్వాతంత్ర్యం గురించి అవమానకరంగా మాట్లాడారంటూ కంగానాపై తెలంగామ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంగనపై కేసు నమోదైంది.

అనంతరం సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ.. 1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే.. 2014లోనే అసలైన స్వాతంత్రం వచ్చిందని కంగనా అంటున్నారు. ఒక భారతీయురాలు అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటీ ? కంగనా పిచ్చికూతలు మానుకోవాలి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి.. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలలని డిమాండ్ చేశారు. కాగా, హైదరాబాద్‌లోనే కాకుండా.. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ కంగనపై కేసులు నమోదయ్యాయి.
కంగనా రనౌత్ వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక దేశ ద్రోహమా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీకలు చెందిన నేతలు కూడా కంగనపై మండిపడుతున్నారు. సీపీఐ నేత నారాయణ.. కంగనపై సంచలన విమర్శలు చేశారు. కంగనను విలాసవంతమైన బిక్షగత్తె అంటూ దుయ్యబట్టారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications