హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ వెళ్లిచ్చినవారికి ఆశ్రయం: తెలంగాణ జమాత్ చీఫ్‌తోపాటు 11 మందిపై కేసు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఢిల్లీలో మర్కత్ వెళ్లి వచ్చిన వారి కారణాంగానే దేశంలో సగానికిపైగా కరోనా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. అయితే, అక్కడికి వెళ్లి వచ్చినవారు ప్రభుత్వాలు కోరినప్పటికీ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించుకోకపోవడం వల్ల మరిన్ని కేసులు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వాలే ముందుకు కదులుతున్నాయి. ఇంటెలీజెన్స్ ద్వారా సమాచారం సేకరించి అలాంటివారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. తాజాగా, ఢిల్లీ జమాత్‌కు వెళ్లొచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన 11 మందిపై హబీబ్‌నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

తబ్లీఘీ జమాత్ తెలంగాణ ఇంఛార్జ్ ఇక్రమ్ అలీ తోపాటు మరో 10 మందిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మార్చి నెలలో జమాత్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి తెలంగాణ తబ్లీఘీ జమాత్ అధ్యక్షుడు ఇక్రమ్ అలీ ఆశ్రయం కల్పించారు. ఆశ్రయం ఇచ్చిన 11 మందిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లోని 188, 269, 270 సెక్షన్ల కింద హబీబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Case Filed Against Telangana Jamaat Chief Ikram Ali and 10 others

ఇక్కడ ఆశ్రయం పొందిన వారందరికీ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక్రమ్ తో సహ పలువురిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా, తాము నిబంధనలను ఉల్లంఘించలేదని, ఎవరికీ ఆశ్రయం కల్పించలేదని ఇక్రమ్ చెబుతున్నారు. తాము చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేదని అంటున్నారు.

ఇది ఇలావుండగా, తెలంగాణలో తాజాగా మరో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 563కి చేరింది. ఇప్పటి తెలంగాణలో కరోనా బారినపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో జీహెచ్ఎంసీపై దృష్టి సారించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

English summary
Case Filed Against Telangana Jamaat Chief Ikram Ali and 10 others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X