నయీంతో తెరాస నేతకు లింక్స్: ఆయన ఫోన్‌తోనే బెదిరింపులు, కేసు నమోదు,

హైదరాబాద్: పోలీసు కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన ఓ కీలక నేతకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నయీం సొంత జిల్లా నల్గొండకు చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌కు నయీంతో సంబంధాలు ఉన్నట్టు భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నరుూం బెదిరింపులు, అక్రమ దందాకు సంబంధించి సోమవారం వెలుగుచూసిన ఆడియో టేపులో నయీం నోట ఎమ్మెల్సీ విద్యాసాగర్ పేరు వినబడింది. అదే సమయంలో నయీం నుంచి బెదిరింపులకు గురైన భువనగిరి వ్యాపారి గణప్ప నాగేంద్ర నేరుగా పోలీసులకు ఈ విషయం చెప్పారు.

తనను బెదిరించడానికి నయీం ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ ఫోన్‌నే వాడుకున్నారని వ్యాపారి పోలీసులకు సమాచారమిచ్చాడు. అంతేకాకుండా నయీం తనను బెదిరింపులకు గురిచేసిన ఆడియో ఫుటేజీలను కూడా పోలీసులకు అందజేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ విద్యాసాగర్‌పై భువనగిరి పోలీసులు ఐపిసి 363, 346, 386, 120(బి) సెక్షన్ల కింద కేసు చేసినట్టు సిట్ అధికారి వెల్లడించారు.

Case filed against TRS leader for alleged links with Nayeem

ఇప్పటివరకు నయాం, అతని అనుచరులపై 39 కేసులు నమోదు చేశామని సిట్ అధికారులు తెలిపారు. మంగళవారం మరో పదిమంది నరుూం అనుచరులను అరెస్టుచేసి విచారిస్తున్నట్టు సిట్ పేర్కొంది. నల్గొండలో ఆరుగురు, భువనగిరిలో నలుగురిని అరెస్టు చేసినట్టు సిట్ చెబుతోంది.

నల్గొండలో సయ్యద్ అన్సదుల్లాఘోరి, షేక్ అబ్దుల్లా, మహమ్మద్ తర్ఫాజ్, మహమ్మద్ ముబీన్, జైబుద్దీన్, అజీజ్‌లు అరెస్టు కాగా, భువనగిరిలో కత్తుల జంగయ్య, పులి నాగరాజు, బచ్చు నాగరాజు, గుర్రం శివరాజు అరెస్టయ్యారు. వీరు గ్యాంగ్‌స్టర్ ముఖ్య అనుచరుల్లో ఒకరైన పాశం శ్రీను అనుచరులు. వీరంతా ఓ ఎన్నారై నుంచి రూ.కోటి వసూలు చేశారని సిట్ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+