సీఐపై చెలరేగిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ - ఆడియో వైరల్ : కేసు నమోదు..!!
పోలీసు అధికారిపై అధికార పార్టీ ఎమ్మెల్సీ చెలరేగిపోయారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఒక పోలీసు అధికారిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో దూషించారు. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంచలనంగా మారుతోంది. తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా అంటూ అసభ్యకర పదజాలంతో దూషించారు.
రౌడీ షీటర్లు ఎవరంటూ సీఐ ప్రశ్నించారు. దానికి ఆయన స్పందగా.. నీ అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలతో..సార్ మంచిగా మాట్లాడండి అంటూ సూచించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్సీ పచ్చి బూతులు తిడుతూ '' ఏం పీకుతున్నావ్ రా...అరేయ్ రికార్డు చేయ్‌రా... కార్పెట్ వేస్తే ఏం చేస్తున్నావ్‌రా'' అని ప్రశ్నించారు. దీనికి సీఐ స్పందించి.. కార్పెట్ వేసే పని.. మాదా సార్ అంటూ బదులిచ్చారు. సీఐగా ఇక్కడి నుంచి వెళ్లిపోయినా నీ తాట తీస్తా.. రేపటి నుంచి నీ సంగతి చూస్తానంటూ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సీఐని హెచ్చరించారు. దీని పైన సీఐ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

కాగా, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు తాండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. దీంతో.. పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.ఇన్స్పెక్టర్‌ను అసభ్యకరంగా దూషించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మహేందర్ రెడ్డిపై 353, 504,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరు పరిధిలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా సాగుతున్న ఈ రాజకీయ యుద్దంలో భాగంగా ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఒక పోలీసు అధికారి పైన ఎమ్మెల్సీ మాట్లాడిన తీరు..బూతులు మాట్లాడటం పైన పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications