నాటి నుండి నేటి దాకా..: కేంద్రం జోక్యం అవసరమని చంద్రబాబు

హైదరాబాద్: తెలుగు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా సెక్షన్‌ 8ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారని సమాచారం.

గవర్నర్‌ నరసింహన్‌కు సలహాదారులుగా నియమితులైన అధికారులు మహంతి, శర్మ ఆదివారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ఏడాది కాలంగా రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుతీరును వీరు చర్చించుకున్నారని సమాచారం.

నితమ్‌‌లోకి ఐఏఎస్‌ అధికారి చందన ఖాన్‌ను ప్రవేశించకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం నుంచి న్యాక్, అపార్డ్‌ తదితర సంస్థలను ఏకపక్షంగా వ్యవహరించి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకున్న అంశాలను చంద్రబాబు పేర్కొన్నారని తెలుస్తోంది.

 Cash for vote: chandrababu wants central government interference

హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఇక్కడ పరిపాలనలో గవర్నర్‌ కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సలహాదారులిద్దరూ బాబు ఆహ్వానం మేరకు కలిశారని.. కాదు గవర్నర్ పంపించారనే రెండు వాదనలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ప్రజల భద్రత, రక్షణ, ఆస్తుల పరిరక్షణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై గవర్నర్‌కు కీలక బాధ్యతలు అప్పగించి ఆయనకు సహాయకులను నియమించాలని చట్టంలో ఉందని, దాని ప్రకారమే సలహాదారుల నియామకం జరిగిందని చంద్రబాబు వారి దృష్టికి తెచ్చారని తెలుస్తోంది.

అయితే గవర్నర్‌కు సలహాదారులుగా నియమితులైనప్పటికీ వారికి ఏడాదికాలంగా ఎలాంటి పాత్ర ఇవ్వలేదని చర్చకు వచ్చిందని తెలుస్తోంది. సెక్షన్‌ 8ని కూడా అమలుచేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని విషయాలను కేంద్రం దృష్టికి, గవర్నర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+